Teacher Jobs: ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి

ఉపాధ్యాయుల బదిలీలలో భాగంగా రెండు రోజులలో చేపట్టబోయే సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీలలో ఖాళీలను పూర్తిచేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆరే రాకేష్‌రెడ్డి, బుచ్చి రాములు అన్నారు.

ఈ సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బదిలీలలో సీనియారిటీ జాబితాను అవకతవకలు లేకుండా పారదర్శకతతో చేయాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రమోషన్లలో నాన్‌ జాయినింగ్‌ ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చాగంటి ఆనంద్‌, వేణు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల వేణు, సతీష్‌ పాల్గొన్నారు.
 

☛ Digital lesson: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు

#Tags