Postgraduates And Graduates Applied For Sweeper Posts: షాకింగ్‌.. స్వీపర్‌ ఉద్యోగాలకు భారీగా పోటీ పడుతున్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు

స్వీపర్‌ పోస్టులకు వేలాదిమంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. రోడ్లు ఉడ్చే పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలకు డిగ్రీలు, పీజీలు చదివిన యువత పోటీ పడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టే ఘటన ఇది. వివరాల ప్రకారం.. హర్యానాలో కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ కాగా, అతి తక్కువ సమయంలో లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

Schools Closed Today Due To Rains: నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

వీరిలో 6వేల మంది పీజీ గ్రాడ్యుయేట్లు, 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. రోడ్లు ఊడ్చే ఉద్యోగం కోసం లక్షలాది మంది యువత పోటీపడుతుండటం, అందులోనూ పీజీ, డిగ్రీలు పూర్తి చేసిన వారు సైతం ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Exams In September 2024: సెప్టెంబర్‌లో జరగనున్న పరీక్షల లిస్ట్‌ ఇదే..

కేవలం రూ. 15వేల జీతం, అది కూడా పారిశుద్ధ కార్మికులుగా చేరడం కోసం అంత చదువులు చదివిన వారు సైతం పోటీ పడటంతో ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు అభ్యర్థులను సంప్రదించగా, స్వీపర్‌గా ఇప్పుడు చేరినా, భవిష్యత్‌లో ఉద్యోగం పర్మినెంట్‌ అయ్యే అవకాశం ఉందని, అందుకే అప్లై చేసినట్లు తెలిపారు. మరికొందరేమో ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం కారణంగా దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించారు. 

#Tags