Outsourcing Posts: వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు

వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు

వికారాబాద్‌ అర్బన్‌: జిల్లా పరిధిలోని అనంతగిరిలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నట్లు ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ రాజేశ్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ విభాగాల్లో 32 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వారు ఈనెల 22 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు అనంతగిరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. వివరాలకు 789385 5655ని సంప్రదించాలన్నారు.

APPSC Group 1: రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్... షేక్‌ అయేషా స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

#Tags