Mini Job Mela: జూలై 4న మినీ జాబ్‌మేళా

పార్వతీపురంటౌన్‌: నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ పార్వతీపురం మన్యం జిల్లా అధికారి వి.సాయికుమార్‌ గురువారం ఒక ప్రకటనలో హితవు పలికారు. ఎంఎస్‌ఎన్‌ ల్యాబొరేటరీస్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌, ముథూట్‌ ఫైనాన్స్‌లో ఇంటర్న్‌ పీఓగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. 18నుంచి 27 ఏళ్ల లోపు ఉన్న ఎంసీఏ, బీటెక్‌, బీఈడీ, బీఎస్సీ, ఎంఎస్సీ కంప్యూటర్స్‌, ఎంసీఏ, బీసీఎస్‌ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగులు జూలై 4న పార్వతీపురం పట్టణంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న మినీ జాబ్‌మేళాకు హాజరుకాగలరని సూచించారు. ఈ మేళాకు సైట్‌ స్పెక్ట్రమ్‌ టెక్నాలజీస్‌, ఎంఎస్‌ఎన్‌ ల్యాబొరేటరీస్‌, ముథూట్‌ ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని, ఆసక్తి గల యువత డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9182398325,7997299739 నంబర్లను సంప్రదించాలని స్పష్టం చేశారు.

#Tags