Mega Job Mela: 11న అప్రెంటీస్ మేళా.. అర్హులు వీరే..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికీకరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో మార్చి 11వ తేదీ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్టు ఏలూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రధానాధికారి పి.రజిత తెలిపారు.
నగరంలోని ఐటీఐ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి ఈ మేళా ప్రారంభమవుతుందని, లిక్సిల్ ఇండియా, అశోక్ లేలాండ్, మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా, నాగ హనుమాన్ ఆగ్రో ఆయిల్స్, దీపక్ నెక్స్‌జన్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ పాస్, ఫెయిల్ అయిన వారు, ఐటీఐ డిప్లొమా లేదా ఏదైనా వృత్తి విద్య కోర్సు చేసిన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ మార్కుల మెమోలు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు తమ కార్యాలయం పనివేళల్లో 08812–230269 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
APPSC Job Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
#Tags