Employment Training: నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ!
స్వయం ఉపాధిలో రాణించేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నట్లు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ పుష్ప కుమార్ తెలిపారు.
కర్నూలులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ సంస్థ 2003 నుంచి నిరంతరాయంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ ఏడాది 846 మందికి శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 235 మందికి ఇచ్చినట్లు తెలిపారు.
అగ్నివీర్–వాయు 2/2025 నోటిఫికేషన్ విడుదల.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్ స్కీమ్
శిక్షణ తర్వాత స్వయం ఉపాధిలో రాణించేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణ గరిష్టంగా నెల రోజులు ఉంటుందని, ఈ కాలంలో భోజనంతో పాటు వసతి కూడా కల్పిస్తామన్నారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
#Tags