Stenographer Posts Notification : స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–సి, గ్రేడ్‌–డి హోదాల్లో కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హ‌త‌తోనే పోటికి అవ‌కాశం..

సర్కారీ కొలువు.. ఎక్కువ మంది స్వప్నం! పదో తరగతి నుంచి ప్రొఫెషనల్‌ కోర్సుల ఉత్తీర్ణుల వరకు.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతూ.. ఆయా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి!!

ఇలాంటి తరుణంలో.. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువుదీరే అవకాశం స్వాగతం పలుకుతోంది!! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసిన స్టెనోగ్రాఫర్‌ నియామక ప్రకటన ద్వారా గ్రేడ్‌–సి, గ్రేడ్‌–డి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ నోటిఫికేషన్‌ వివరాలు,ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ తదితర సమాచారం.. 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం–కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మొత్తం 2,006 స్టెనోగ్రాఫర్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. పోస్ట్‌లను స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–సి, గ్రేడ్‌–డి పేరుతో వర్గీకరించారు. వీటికి ఎలాంటి టైప్‌ రైటింగ్‌ సర్టిఫికెట్లు అవసరం లేకుండా.. షార్ట్‌ హ్యాండ్‌ నైపుణ్యం అవసరం లేకున్నా పోటీ పడే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియలో నిర్వహించే స్కిల్‌ టెస్ట్‌లో.. కంప్యూటర్‌ టైపింగ్, డిక్టేషన్‌ను నోట్‌ చేసుకోవడం వంటి నైపుణ్యాలను పరిశీలిస్తారు.

AP & TS NEET UG Cutoff Marks 2024 : ఏపీ, తెలంగాణ నీట్‌ యూజీ -2024 కటాఫ్‌ మార్కులు ఇవే.. కౌన్సెలింగ్ తేదీలు ఇవే..!

అర్హతలు
ఆగస్ట్‌ 17, 2024 నాటికి ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.

వయసు
➜    గ్రేడ్‌–సి స్టెనోగ్రాఫర్‌: 2024, ఆగస్ట్‌ 1 నాటికి 18–30 ఏళ్లు(ఆగస్ట్‌ 2, 1994– ఆగస్ట్‌ 1, 2006 మధ్యలో జన్మించి ఉండాలి).
➜    గ్రేడ్‌–డి స్టెనోగ్రాఫర్‌: 2024, ఆగస్ట్‌ 1 నాటికి 18–27 ఏళ్లు(ఆగస్ట్‌ 2, 1997 – ఆగస్ట్‌ 1, 2006 మధ్యలో జన్మించి ఉండాలి).
➜    గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున సడలింపు లభిస్తుంది.

రెండంచెల ఎంపిక ప్రక్రియ
ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–సి, గ్రేడ్‌–డి పోస్ట్‌ల భర్తీ ప్రక్రియను రెండు దశలుగా నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌.

తొలి దశ రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియ తొలి దశలో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.

School Holidays : విద్యార్థులకు సెల‌వుల‌వార్త‌.. వ‌రుస‌గా ఐదు రోజులు.. కాని!

రెండో దశ స్కిల్‌ టెస్ట్‌
➜    రాత పరీక్ష తర్వాత దశలో స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్టెనోగ్రఫీ టెస్ట్‌ నిర్వహిస్తారు.
➜    ఇంగ్లిష్‌ భాషలో నిమిషానికి 100 పదాలు, హిందీ భాషలో నిమిషానికి 80 పదాలు ప్రాతిపదికగా డిక్టేషన్‌ ఇస్తారు. అభ్యర్థులు ఆ డిక్టేషన్‌ను నోట్‌ చేసుకుని.. దాన్ని కంప్యూటర్‌పై క్షుణ్నంగా టైప్‌ చేయాల్సి ఉంటుంది.
➜    ఇంగ్లిష్‌ కంప్యూటర్‌ టైపింగ్‌కు సంబంధించి స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–డి పోస్ట్‌ల అభ్యర్థులు 50 నిమిషాల్లో, గ్రేడ్‌–సి పోస్ట్‌ల అభ్యర్థులు 40 నిమిషాల్లో సదరు డిక్టేషన్‌ టైపింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.
➜    హిందీకి సంబంధించి స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–డి అభ్యర్థులు 65 నిమిషాల్లో, గ్రేడ్‌–సి అభ్యర్థులు 55 నిమిషాల్లో..డిక్టేషన్‌ను క్యంపూటర్‌ టైపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ భాష ప్రాధాన్యాన్ని పేర్కొనాల్సి ఉంటుంది.

రాత పరీక్షలో మెరిట్‌తో
తుది నియామకాలు ఖరారు చేసే క్రమంలో రాత పరీక్షలో పొందిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు. స్కిల్‌ టెస్ట్‌లోనూ నిర్దేశిత మార్కుల విధానాన్ని అనుసరిస్తారు. ఈ రెండింటినీ క్రోడీకరించి తుది జాబితా రూపొందించి.. నియామకాలు ఖరారు చేస్తారు.

10 Days Holidays : సెల‌వులే సెల‌వులు.. విద్యార్థుల‌కు వ‌రుసగా ప‌ది రోజులు హాలిడేస్‌.. ఈ ఒక్క‌రోజు మాత్రం..!

గెజిటెడ్‌ హోదాకు చేరుకునే అవకాశం

స్టెనో గ్రాఫర్‌ గ్రేడ్‌–సి(గ్రూప్‌–బి నాన్‌ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–డి(గ్రూప్‌–సి) పోస్ట్‌లకు ఎంపికైన వారు భవిష్యత్తులో పదోన్నతుల ద్వారా గెజిటెడ్‌ హోదాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆయా శాఖల్లో సూపరింటెండెంట్‌ స్థాయి వరకు పదోన్నతులు లభిస్తాయి. ప్రారంభంలో గ్రేడ్‌–సి ఉద్యోగులకు రూ.9300– రూ.34,800 వేతన శ్రేణి, గ్రేడ్‌–డి ఉద్యోగులకు రూ.5,200–రూ.20,200 వేతన శ్రేణితో నెల వేతనం లభిస్తుంది.

ముఖ్య సమాచారం
➜    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
➜    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఆగస్ట్‌ 17.
➜    ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: 2024, ఆగస్ట్‌ 27, 28 తేదీల్లో.
➜    ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: అక్టోబర్‌/నవంబర్‌లో నిర్వహించే అవకాశం.
➜    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.gov.in

Anganwadi Salaries : అంగ‌న్వాడీల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. వేత‌నం పెంచ‌డంలో మంత్రి సీత‌క్క వివ‌ర‌ణ‌.. కాని!

రాత పరీక్ష రాణించేలా
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
ఈ విభాగంలో రాణించేందుకు.. వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సిరీస్‌ (నంబర్‌/ఆల్ఫా న్యుమరిక్‌) విభాగం, అనాలజీస్, ఆడ్‌మెన్‌ ఔట్, సిలాజిజమ్, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్‌ ఫార్మేషన్, బ్లడ్‌ రిలేషన్స్, నాన్‌ వెర్బల్‌ (వాటర్‌ ఇమేజ్, మిర్రర్‌ ఇమేజ్‌), కోడింగ్‌ డీకోడింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. అదే విధంగా అర్థగణిత అంశాలైన సింపుల్‌ ఇంట్రెస్ట్, కంపౌండ్‌ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, శాతాలను ప్రాక్టీస్‌ చేయాలి. త్రికోణమితి, అల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్‌ వర్క్, టైం అండ్‌ డిస్టెన్స్‌లకు సంబంధించిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌
జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్‌ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను ప్రత్యేకంగా చదవాలి. జాగ్రఫీలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక వాణిజ్య రంగాల్లో ఏర్పడిన కీలక పరిణామాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపైనా పట్టు సాధించడం మేలు చేస్తుంది.

Good News for Govt Employees : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పెర‌గ‌నున్న బేసిక్ పే.. శుభ‌వార్తను అందించిన కేంద్రం..!

సీహెచ్‌ఎస్‌ఎల్‌ అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌ను కీలకంగా భావించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి. స్టాక్‌ జీకేకు సంబంధించి చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలు, వాటి తీర్మానాలు, అవార్డులు–విజేతలు వంటి సమాచారంపై అవగాహన పెంచుకోవాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌
ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌–ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్, స్పెల్లింగ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవా­లి. కాంప్రహెన్షన్‌కు సంబంధించి పేరాగ్రాఫ్‌ రీడింగ్‌పై దృష్టిపెట్టాలి. దినపత్రికలోని ఎడిటోరియల్స్, ఆయా ముఖ్యాంశాలతో కూడిన వ్యాసాలను చదవాలి. వీటి సారాంశాన్ని సొంతంగా రాసుకుని.. ప్రశ్నలు అడిగే వీలున్న అంశాలను గుర్తించాలి.

IAS Officer Smita Sabharwal Inter Marks : వైర‌ల్‌గా మారిన ఐఏఎస్ ఆఫీస‌ర్ స్మితా స‌బ‌ర్వాల్ ఇంట‌ర్ మార్క్ షీట్‌..

స్కిల్‌ టెస్ట్‌
ఎంపిక ప్రక్రియలోని రెండో దశ స్కిల్‌ టెస్ట్‌కు కూడా సన్నద్ధత పొందాలి. ఇందుకోసం ప్రతి రోజు నిర్దేశిత సమయంలో ప్రాక్టీస్‌ చేయాలి. ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా వ్యాఖ్యానాలను పది నిమిషాల్లో రాసుకుని.. వాటిని పరీక్షకు నిర్దేశించిన సమయంలో టైప్‌ చేయడాన్ని ప్రాక్టీస్‌ చేయాలి. ఇలా మొదటి నుంచే ప్రాక్టీస్‌ చేస్తే.. స్కిల్‌ టెస్ట్‌ సమయానికి పూర్తి సంసిద్ధత లభిస్తుంది. 

Job Notification : ఐబీపీఎస్‌లో ఈ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!

#Tags