Job Mela: రేపు జాబ్‌మేళా

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తమ కార్యాలయంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

టాటా ఎలక్ట్రానిక్స్‌లో 390 పోస్టులు, ఫాక్సన్‌ ఇండియాలో 350, ముత్తూట్‌ గ్రూప్‌లో 760 ఉద్యోగాలకు వివిధ కేటగిరీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదో తరగతి, డిగ్రీ, ఫార్మసీ చదివిన వారు హాజరు కావచ్చన్నారు. ఎంపికై న వారికి రూ.14 వేల నుంచి రూ.30 వేల వరకూ వేతనం ఉంటుందన్నారు. వివరాలకు 0884– 2373270 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.

చదవండి: Mega Job Mela: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 7న మెగా జాబ్‌మేళా..

#Tags