Job Mela: రేపు జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం, మొత్తం ఎన్ని ఖాళీలంటే..

శ్రీకాకుళం : బలగ హాస్పిటల్‌ జంక్షన్‌లోని డీఎల్‌టీసీ/ప్రభుత్వ ఐటీఐ శిక్షణా సంస్థలో ఈ నెల 9న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్‌ఎల్‌ జిందాల్‌లో హెల్పర్స్‌ పోస్టులకు, కేవీ హ్యూమన్‌ రిసోర్సెస్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌, డేటాఎంట్రీ ఆపరేటర్‌, బేటరీ ఆపరేటర్‌ తదితర పోస్టుల భర్తీకి జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

National Scholarships: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.. వీళ్లు అర్హులు

జిందాల్‌లో పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగి 8వ తరగతి నుంచి ఐటీఐ వరకు చదివిన పురుషులు అర్హులని పేర్కొన్నారు. 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎంపికై నవారు నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. కేవీ హ్యూమన్‌ సంస్థ పోస్టులకు 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ చదువుకున్న పురుషులు అర్హులని పేర్కొన్నారు.

Navodaya Admission 2024: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

572 పోస్టులు ఖాళీ ఉన్నాయని, ఎంపికై నవారు సంగారెడ్డి జిల్లా ఎలమంచిలిలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

#Tags