Job Mela in Andhra Pradesh: ఎస్వీయూలో జాబ్‌ మేళా రేపు

తిరుపతి సిటీ: ఎస్వీ యూనివర్సిటీ మోడల్‌ కెరీర్‌ సెంటర్‌లో ఈ నెల 4వ తేదీ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ టి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. సీఎంఆర్‌ జ్యువెలరీ, గంగోత్ర ట్రేడర్స్‌, అపోలో పార్మసీ లిమిటెడ్‌ కంపెనీల ప్రతినిధులు జాబ్‌ మేళాలో పాల్గొంటారని పేర్కొన్నారు. మార్కెటింగ్‌, ఎలక్ట్రిషియన్‌, డ్రైవర్స్‌, హెల్పర్స్‌, ఫార్మసిస్ట్స్‌ వంటి ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు హాజరు కావచ్చని పేర్కొన్నారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, డిపార్మసీ, బీపార్మసీ, ఎంఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలియజేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో శుక్రవారం ఉదయం 10గంటలకు వర్సిటీలోని ఎంప్లాయిమెంట్‌ కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7989810194 నంబర్‌లో సంప్రదించవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

AU M.Sc Results 2023: ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల ఫలితాల విడుదల 

దూర విద్య డిగ్రీ ఫలితాల విడుదల
తిరుపతి సిటీ : ఎస్వీ యూని వర్సిటీ దూరవిద్య కేంద్రం(డీడీఈ) పరిధిలో ఈ ఏడాది ఏప్రెల్‌లో నిర్వహించిన డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) తృతీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు డీడీఈ వెబ్‌సైట్‌ను గాను www.manabadi.co.in వెబ్‌సైట్‌ను వీక్షించి ఫలితాలను తెలుసుకోవచ్చని సూచించారు.

#Tags