Job Chart and Promotions : ఉద్యోగులకు జాబ్ చార్టు, ఉద్యోగోన్నతులపై ఆత్మీయ సమావేశం..
గాంధీనగర్: శనివారం విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో డెమోక్రటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హాజరైయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జాబ్ చార్టు, ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
Teachers Transfer : బదిలీలను ఈ నిష్పత్తిలో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్..
అంతేకాకుండా, గత ఐదేళ్లుగా సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల సచివాలయాల్లో 19 విభాగాల్లో 1.26 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి వారి సేవలను అందిస్తున్నారని వివరించారు ఆయన. అయితే, ఈ సమావేశంలో పాల్గొన్న మరికొందరు.. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కూడా మాట్లాడుతూ.. రేషనలైజేషన్, క్లస్టర్ విధానం, వంటి ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థపై కమిటీని నియమించి దాని నివేదిక ఆధారంగా మార్పులు చేయాలని సమావేశంలో కోరారు అధికారులు.