Indian Railways: దేశంలో 2.50 ల‌క్ష‌ల రైల్వే ఉద్యోగాల ఖాళీ.... రిక్రూట్‌మెంట్ ఎప్పుడంటే..?

ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వ‌ర్క్ మ‌న‌సొంతం. అలాగే దేశంలో కొన్ని ల‌క్ష‌ల మందికి ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను రైల్వేస్ క‌ల్పిస్తున్నాయి. గ‌త కొన్నేళ్లుగా పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్ప‌డ్డాయి. ఖాళీల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
Indian Railways has 2.5 lakh-plus posts lying vacant

దేశంలో రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉండటం గమనార్హం. ఈ మేరకు రైల్వేశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో పేర్కొంది. దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా మొదటిస్థానంలో నిలిచిన రైల్వేశాఖ.. దేశంలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగాను గుర్తింపు పొందింది.

చ‌ద‌వండి: వ‌ర్క్ ఫ్రం హోంకు బైబై.. ఆఫీస్‌కు రాని వారిని తొల‌గించాల‌ని నిర్ణ‌యం... 10 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం..!

ఇక కీలకమైన ఆపరేషనల్‌ సేఫ్టీ విభాగంలో 53,178 పోస్టులు పెండింగులో ఉండటం గమనార్హం. దేశంలో అన్ని రైల్వేజోన్ల పరిధిలో కలిపి మొత్తం 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిలో అత్యధికంగా గ్రూప్‌–సి ఉద్యాగాలే 2.48 లక్షలు ఖాళీగా ఉన్నాయి.

చ‌ద‌వండి:  కోటి రూపాయ‌ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన ఐఐఐటీ అమ్మాయి... 

గ్రూప్‌–ఏ ఉద్యోగాలు 1,965, గ్రూప్‌–బి ఉద్యోగాలు 105 ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నార్తర్న్‌ రైల్వేలో 32,636 పోస్టులు ఖాళీగా ఉండగా, అత్యల్పంగా దక్షిణ పశ్చిమ రైల్వే జోన్‌లో 4,897 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయితే గ‌త  రెండు, మూడేళ్లుగా రిక్రూట్‌మెంట్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. దీనికితోడు రైల్వేస్‌ను ప్రైవేటుప‌రం చేస్తార‌నే వార్త‌లు విన‌వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని నిరుద్యోగులు కోరుతున్నారు. 

#Tags