Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, సర్టిఫికెట్లు, ఉపాధి... అర్హత ఏంటంటే...

ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.

Pradhan Mantri Kaushal Vikas Yojana: ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్రం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

చదవండి: 9231 గురుకులం పోస్టులు.. కేట‌గిరి వారీగా ఉద్యోగాల‌ భ‌ర్తీ ఇలా.. అత్య‌ధికం ఖాళీలు

ఈ మేరకు ఆ కేంద్రం మేనేజర్‌ బి.శ్రీకాంత్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌, రిటైల్‌ సేల్స్‌ అసోసియేట్‌ అంశాలపై 55 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుంది.

వీటితో పాటు కంప్యూటర్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూ టిప్స్‌పై శిక్షణ ఇస్తారు. పదో తరగతి పాస్‌, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ ఫెయిల్‌ అయి, 18 నుంచి 32 సంవత్సరాల్లోపు ఉన్న వారు అర్హులు.

పూర్తి వివరాలకు అనంతపురం శివారులోని చిన్మయనగర్‌లో ఉన్న కౌశల్‌ కేంద్రాన్ని (70321 34767, 81257 46282) సంప్రదించవచ్చు.

చదవండి: AP DSC Notification 2023 : ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్‌..? పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags