Women Employment : మ‌హిళ‌ల‌కు ఉపాధి అవ‌కాశం.. ప‌ది పాసైతే చాలు.. ఇదే చివ‌రి తేదీ..

మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. ఎంతోమంది మ‌హిళ‌లు కొలువు కోసం వేచి చూస్తుంటారు. అయితే, వారికి ఇదే గొప్ప అవ‌కాశం.

సాక్షి ఎడ్యుకేష‌న్: మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. ఎంతోమంది మ‌హిళ‌లు కొలువు కోసం వేచి చూస్తుంటారు. అయితే, వారికి ఇదే గొప్ప అవ‌కాశం. ఒక‌వేళ మీరు టెన్త్ (10) పాసైతే చాలు. అసలు విష‌యానికొస్తే.. ఏజెన్సీలో ఆరు మండలాల్లో కొత్తగా 39 అంగన్వాడీ కేంద్రాలలో ఆయా పోస్టులు మంజూరైయ్యాయి. ఈ పోస్టుల్లో అభ్య‌ర్థుల‌ను పారదర్శకంగా ఎంపిక చేస్తార‌ని అర్హులు, ఆస‌క్తి ఉన్న మ‌హిళ‌లు వెంట‌నే ద‌ర‌ఖాస్తులు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు.. రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కెఆర్‌.కల్పశ్రీ.

TTD Jobs Notification : టీటీడీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే...! ఇంకా..

39 పోస్టులు..

రంపచోడవరం, అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో 39 ఆయా పోస్టుల భర్తీపై ఐసిడిఎస్‌ సిడిపిఓతో, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లతో శుక్రవారం తన చాంబర్లో సబ్‌ కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన గిరిజన అభ్యర్థులను ఎంపిక చేస్తామ‌ని వివ‌రించారు. ఈ పోస్టుల‌ను మండ‌లాల వారిగా భ‌ర్తీ చేయ‌నున్నారు.

పోస్టుల వివరాలు..

అడ్డతీగల మండలం : వెంకటనగరం, చిక్కపుగడ్డ, మాకవరం, రేగడవీధి, పినికిలపాడు, తీయ్యమామిడి, రోళ్లగడ్డ
రంపచోడవరం మండలం : చెరువుపాలెం, పెదపాడు, గంగవరం మండలం : శరభవరం, చిన్న అడ్డపల్లి మారేడుమిల్లి మండలం : మల్లవరం, నీలవరం, బందపాటి వీధి, మూసూరు, ఇ.కొత్తవీధి, కొత్తవలస ముంతమామిడి, రాజవొమ్మంగి మండలం : బొడ్లగండి, లోతవారి వీధి
వై.రామవరం మండలం : పసరుగిన్నె, పుట్టగండి, భీమునిగడ్డ, సింహాద్రి పాలెం, రచ్చవలస, పాముగొంది, సింగవరం, మునగలపూడి, కోకితగొంది, బొడ్డపల్లి, కొత్తూరు, చింతకొయ్య, నాగలోవ, కొమరవరం, చలమటిపాకలు, గొరబంద, కొత్త పాటలు, పైడిపుట్ట, జాజి వలస తదితర గ్రామాల్లో ఆయా పోస్టులు భర్తీ చేయనున్నారు. 

Bank of Baroda Job Notification 2025 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 1267 పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

అర్హ‌త‌: ఆయా పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, సంబంధిత గ్రామాల్లో నివాసులైన మహిళలు 
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20 నుండి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ఐసిడిఎస్‌ సిడిపిఓల కార్యాలయాలలో నేరుగా దరఖాస్తు సమర్పించాలి.
ఎంపిక విధానం: అర్హత పొందిన అభ్యర్థులకు మౌలిక పరీక్ష తేదీ తరువాత ప్రకటిస్తారు.

Agniveer Vayu Recruitments 2024 : అగ్నివీర్ వాయు కొలువుల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఈ విధానంలోనే ఎంపిక‌లు..!

ఈ 39 పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత గల అభ్యర్థులను ఎంపిక కమిటీ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేస్తామ‌ని తెలిపారు సబ్‌ కలెక్టర్‌ కెఆర్‌.కల్పశ్రీ. ఈ సమావేశంలో సిడిపిఓలు సంధ్యారాణి, లక్ష్మీ ప్రసన్న, దేవమణి, సూపర్వైజర్లు సుధా, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags