Jee Main Results: పేదింటి పిల్లలు మెరిశారు!.. ‘జేఈఈ మెయిన్‌లో సత్తాచాటిన సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల

రాయదుర్గం: జేఈఈ మెయిన్‌లో శేరిలింగంపల్లిలో ని గౌలిదొడ్డి ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర, బాలికల కళాశాలలు ప్రభంజనం సృష్టించాయి.

బాలికల కళాశాలలో జేఈఈ మెయిన్‌కి ఈ విద్యా సంవత్సరంలో 80 మంది బాలికలు పోటీపడగా, అందులో 66 మంది ఏకంగా అడ్వాన్స్‌డ్‌కి అర్హత సాధించడం విశేషం. అందులో 90 పర్సంటై ల్‌ కన్నా ఎక్కువగా 9 మంది బాలికలు, 85 పర్సంటైల్‌ కంటే ఎక్కువగా 12 మంది, 80 పర్సంటైల్‌ కన్నా ఎక్కువగా 12 మంది, 70 పర్సంటైల్‌ కంటే ఎక్కువగా 17 మంది, 60 పర్సంటైల్‌ కంటే ఎక్కువగా 16 మంది సాధించారు.

బాలికల కళాశాల నుంచి ఆర్‌ శ్రుతిక 97.80 పర్సంటైల్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది. వైష్ణవి 96.19 పర్సంటైల్‌ను, బి భార్గవి 93.07 పర్సంటైల్‌ సాధించి తర్వాతి స్థా నాల్లో నిలిచారు. కాగా ఎం.ధరణి 92.73, టి.శ్రీజ 92.29 సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ శారద మాట్లాడుతూ పేదింటి పిల్లలు తమ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారన్నారు.

చదవండి: Jee Main Results 2024: మెయిన్‌లోనూ మనోళ్లు టాప్‌.. 100% సాధించిన తెలుగు విద్యార్థులు.. వారి ర్యాంకులు

బాలుర కళాశాలలో 83 మందికి అర్హత.. 

జేఈఈ మెయిన్‌ పరీక్షలో 104 మంది బాలురు ప రీక్షలు రాయగా అందులో ఏకంగా 83 మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించారు. ఎర్రంబాటి సాయిరామ్‌ 99.62 పర్సంటైల్‌తో కళాశాలలో అగ్రస్థానంలో నిలిచారు. ఊటుకూరి వెంకటేశ్‌ 99.31తో ద్వితీయ స్థానంలో నిలిచారు. కాగా 27 మంది విద్యార్థులు 90 పర్సంటైల్‌ సాధించగా 54 మంది విద్యార్థులు 80 పర్సంటైల్‌ను, 84 మంది విద్యార్థులు 60 పర్సంటైల్‌ను సాధించి అడ్వాన్స్‌డ్‌కు అర్హ త సాధించడం విశేషం.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ వట్టికొండ పాపారావు మాట్లాడుతూ గ్రా మీణ నేపథ్యం, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి నా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంతటి విజయాన్ని సాధించారని ప్రశంసించారు. కాగా, గౌలి దొడ్డిలోని బాలుర, బాలికల కళాశాలల్లో చదివే విద్యార్థులంతా పేదింటి పిల్లలే. డ్రైవర్, రైతుకూలీ, నిత్యకూలీ, ప్రైవేటు ఉద్యోగి, కూరగాయల విక్రయదారు, చిన్న కారురైతు, పవర్‌లూమ్‌ వర్కర్‌గా పనిచేసే వారి పిల్లలే జేఈఈ మెయిన్‌లో సత్తా చాటడం విశేషం. 
 

#Tags