NEET & JEE 2024: నీట్, జేఈఈ ప్రిపరేషన్ మెళకువలు తెలిపిన ఆకాశ్ టాపర్స్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నీట్, జేఈఈ వంటి కాంపిటీటివ్ పరీక్షలకు ముందు విద్యార్థులు ప్రా క్టీస్ టెస్ట్‌లు అస్సలు మిస్ కావొద్దని నీట్– 2023 టాపర్ ఆకాషియన్ విముక్త శర్మ చెప్పా రు.
ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించి నీట్, జేఈఈ వంటి కాంపిటీటివ్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన పలువురు విద్యార్థులు వారి ప్రి పరేషన్‌కు సంబంధించిన సలహాలు, సూచన లు ఇచ్చారు. టాపర్లుగా నిలిచివారి విజయంలో రోజువారీ టెస్టులు కీలకపాత్ర పోషిస్తాయ ని పేర్కొన్నారు.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
నీట్ యూజీ–2023 టాపర్ కౌస్తవ్ బౌరి మాట్లాడుతూ మాక్ టెస్టులు రాయడం తప్పనిసరని, పరీక్ష అనంతరం ప్రశ్నపత్రం గురించి లెక్చరర్లతో చర్చిస్తే సందేహాలు నివృత్తి అవుతాయన్నారు. జేఈఈ మెయిన్ టాపర్ శ్రీరామ్ మాట్లాడుతూ ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చరర్లు ప్రతీ విద్యార్థి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
Published date : 20 Mar 2024 12:34PM