JEE Mains Application Corrections Last date : జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్‌.. దరఖాస్తు సవరణలకు చివరి తేదీ ఇదే

జేఈఈ మెయిన్స్‌ అభ్యర్థులకు అలర్ట్‌. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో ఏవైనా సవరణలు ఉంటే సరిచేసుకోవచ్చవని ఎన్టీఏ తెలిపింది.
Important notice for JEE Mains candidates by NTA JEE Mains Application Corrections Last date NTA announcement on JEE Mains application corrections

జేఈఈ మెయిన్స్‌- 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాము సమర్పించిన దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే నవంబర్‌ 26 నుంచి 27వ తేదీ రాత్రి 11.50గంటల వరకు సరి చేసుకోవచ్చని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వెల్లడించింది.

National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ అర్హత పరీక్ష..హాల్‌టికెట్స్‌ విడుదల

అయితే అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్, శాశ్వత / ప్రస్తుత చిరునామా, అత్యవసర సంప్రదింపు వివరాలు, ఫోటోలను మార్చడానికి మాత్రం అనుమతి లేదు. కేవలం తమ పేరు, తల్లి పేరు/తండ్రి పేరు, మార్కుల వివరాలు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ లభిస్తుంది. 

ముఖ్యమైన తేదీలు:

  1. అప్లికేషన్ ప్రారంభ తేదీ: అక్టోబర్ 28, 2024
  2. అప్లికేషన్ చివరి తేదీ: నవంబర్ 22, 2024 (రాత్రి 09:00 గంటల వరకు)
  3. ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 22, 2024 (రాత్రి 11:50 వరకు)
  4. పరీక్షా తేదీలు: జనవరి 22 నుండి జనవరి 31, 2025
  5. ఫలితాల విడుదల: ఫిబ్రవరి 12, 2025లోపు

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags