JEE Main 2024 Admit Cards Download Link : జేఈఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
మొదటి రోజు.. బీఆర్క్/ బీప్లానింగ్ (పేపర్-2 పరీక్ష) రెండో షిఫ్టులో నిర్వహిస్తారు. అలాగే బీటెక్/బీఈ పరీక్ష (పేపర్ 1) జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1న రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. పూర్తి వివరాల కోసం జేఈఈ మెయిన్ అధారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
➤ జేఈఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డు డౌన్లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జాగ్రత్తలు ఇవే..
☛ జేఈఈ మెయిన్ పరీక్ష 2024 సెషన్ 1 పరీక్ష రోజున అభ్యర్థులు.. అడ్మిట్ కార్డు కాపీతో పాటు ఫోటో ఐడీ, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డులో పరీక్ష రోజు సూచనలు, రిపోర్టింగ్ సమయం, పరీక్ష కేంద్రం చిరునామా, పరీక్షకు డ్రెస్ కోడ్, ఏయే వస్తువులను వేదిక లోపలికి అనుమతిస్తారు వంటి కీలక వివరాలు ఉంటాయి. వాటిని చూసి.. పరీక్షకు వెళ్లాలి.
☛ అభ్యర్థులు ఈ సూచనలన్నింటినీ జాగ్రత్తగా చదివి నిబంధనలను పాటించాలి. పేరు, ఫోటో, సంతకం, జెండర్ వంటి అన్ని వ్యక్తిగత సమాచారాలు.. అడ్మిట్ కార్డులో సరిగ్గా ఉన్నాయా? లేదా అని చెక్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డుల్లో తప్పులు కనిపిస్తే.. వెంటనే ఎన్టీయేకు తెలియజేయాలి.
చదవండి: JEE Success Tips : జేఈఈ మెయిన్స్ & అడ్వాన్స్‌డ్ రాసే విద్యార్థులకు నా సలహా ఇదే..
జేఈఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా..
➤ స్టెప్ 1 : జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
➤ స్టెప్ 2 : జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2024 ఫర్ సెషన్ 1 అన్న లింక్‌పై క్లిక్ చేయండి.
➤ స్టెప్ 3:- కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ లాగిన్ వివరాలను వెల్లడించండి.
➤ స్టెప్ 4: సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
➤ స్టెప్ 5: అడ్మిట్ కార్డు.. స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోండి.
➤ స్టెప్ 6: అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసి.. హార్డ్ కాపీ తీసుకోండి.