JEE Advanced Exam: రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. బంగారు ఆభరణాలకు అనుమతి నిరాకరణ

ఇంజనీరింగ్‌ కోర్సులకు దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రేపు(ఆదివారం)జరగనుంది. 

రెండు సెషన్లలో పరీక్ష..
దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు.

JEE Advanced 2024: రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మకమైన 23 ఐఐటీల్లో, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో బీటెక్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిబంధనలు ఇవే..

అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిరీ్ణత సమయానికి ముందుగానే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశానికి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను లోపలకు అనుమతించరు. పరీక్షకు రెండు గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. 
అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్‌ కార్డులను తీసుకురావాలి. దానితో పాటు అధికారిక ఫొటో ఐడీ కార్డునూ తెచ్చుకోవాలి. అడ్మిట్‌కార్డు జిరాక్స్‌ కాపీని ఇని్వజిలేటర్లకు అందించి ఒరిజినల్‌ కాపీని తమ వద్దే ఉంచుకోవాలి. 
అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో, అటెండెన్స్‌ షీటులో తమ వేలిముద్రను వేసేముందు వేలిని శుభ్రం చేసుకోవాలి. 

Kyrgyzstan: కిర్గిస్తాన్‌కు మనోళ్లు ఎందుకు వెళ్తున్నారు? అక్కడి కరెన్సీ విలువ ఎంత?

అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను కూడా అమలుచేయనున్నారు. షూలు ధరించి రాకూడదు. అలాగే, పెద్ద బటన్‌లతోని వస్త్రాలను, ఫుల్‌స్లీవ్‌ వ్రస్తాలను, బంగారపు ఆభరణాలను ధరించరాదు.  
⇒బాల్‌పాయింట్‌ పెన్నును మాత్రమే వినియోగించాలి. 

పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు. ఎలాంటి డిజిటల్‌ పరికరాలను అనుమతించరు. 
అభ్యర్థులు ట్రాన్స్‌పరెంట్‌ బాటిళ్లలో మాత్రమే తాగునీటిని తెచ్చుకోవాలి. 
అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పేపర్, పుట్టిన తేదీ, జెండర్‌ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.

#Tags