JEE Advanced 2025: మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్..
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ ఈసారి ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
మూడు గంటల వ్యవధితో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్‌ను ఇప్పటికే ప్రకటించింది.
AP Tenth Class Annual Exams 2025:పదో తరగతి పరీక్షలను మార్చి 15 నుంచి నిర్వహించాలని విద్యా శాఖ యోచన....
జనవరి 22 నుంచి 31 వరకూ ఒక సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ రెండో సెషన్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలుండగా, వీటిల్లో 17,740 సీట్లున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags