JEE Advanced 2024 Exam: ప్రశాంతంగా ముగిసిన జేఈఈ మెయిన్‌ అడ్వాన్స్‌డ్‌

రామగిరి: ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాలయాల్లో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రామగిరి మండలం సెంటనరీకాలనీ మంథని జేఎన్టీయూలో ప్రశాంతంగా ముగిసింది.

రెండు సెషన్స్‌లో జరిగిన పరీక్షలో 106 మంది విద్యార్థులకు 104 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ చెరుకు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును హైదరాబాద్‌ యూనివర్సిటీ అధికారులు పరిశీలించారు.

AP Polycet 2024 Counselling Dates : ఏపీ పాలిసెట్-2024 కౌన్సిలింగ్ తేదీలు ఇవే..

పరీక్ష రాసే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగిరి ఎస్సై కె.సందీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

#Tags