JEE Main 2025 : రెండు సెషన్లలో జేఈఈ–మెయిన్‌ 2025.. సెక్షన్‌–బిలో ఛాయిస్‌ తొలగింపు!

జేఈఈ–మెయిన్‌.. నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో..

బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి జరిపే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంతో ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది సన్నద్ధమవుతున్నారు. జేఈఈ –మెయిన్‌–2025 షెడ్యూల్‌ను ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది! ఈ నేపథ్యంలో.. జేఈఈ–మెయిన్‌ పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, బెస్ట్‌ స్కోర్‌కు ప్రిపరేషన్‌ తదితర వివరాలు.. 

గత ఏడాది మాదిరిగానే 2025 జేఈఈ–మెయిన్‌ను ఈ సంవత్సరం కూడా రెండు సెషన్లుగా నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. తొలి సెషన్‌ను జనవరి 22నుంచి 31 వరకు 10 రోజులపాటు; రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు ఎనిమిది రోజుల పాటు నిర్వహించనుంది. అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు ఒకే సెషన్‌కు లేదా రెండు సెషన్లకు హాజరు కావచ్చు.

Justice Anil Kumar Jukanti: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

జేఈఈ–మెయిన్‌ పేపర్లు ఇలా

జేఈఈ–మెయిన్‌లో బీఈ/బీటెక్‌ అభ్యర్థులకు పేపర్‌–1, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులకు పేపర్‌–2ఎ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల విద్యార్థులకు పేపర్‌–2బి నిర్వహిస్తారు.

అర్హత

ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సులో 2023, 2024లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా 2025లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఛాయిస్‌ విధానం తొలగింపు

జేఈఈ–మెయిన్‌–2025లో పేపర్‌–1లోని పార్ట్‌–బిలో ఛాయిస్‌ విధానాన్ని తొలగించారు. పార్ట్‌–బిలో ఈసారి అయిదు ప్రశ్నలే అడుగుతారు. విద్యార్థులు ఈ అయిదు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. ఎలాంటి ఛాయిస్‌ ఉండదు. మూడు సబ్జెక్ట్‌ల(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో పార్ట్‌–ఎ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్‌–బి నుంచి 5 ప్రశ్నలు చొప్పున మొత్తం 75 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం 300 మార్కులకు పేపర్‌–1ను నిర్వహించనున్నారు.

రెండింటీకి.. ఇలా

జేఈఈ–మెయిన్‌లో మంచి స్కోర్‌ సాధించడానికి ఆయా సబ్జెక్ట్‌లకు లభిస్తున్న వెయిటేజీను అనుసరిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి. అదే సమయంలో బోర్డ్‌ పరీక్షల ప్రిపరేషన్‌ను సమన్వయం చేసుకోవాలి. ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. నిర్దిష్ట టైమ్‌ ప్లాన్‌తో ఒకే సమయంలో రెండు పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగించొచ్చు. జేఈఈ–మెయిన్‌ జనవరి సెషన్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు డిసెంబర్‌ నుంచి ఇంటర్మీడియెట్, జేఈఈ–మెయిన్‌ రెండింటిలో ఉన్న ఉమ్మడి అంశాల పునశ్చరణకు అధిక సమయం కేటాయించాలి. తద్వారా రెండు పరీక్షలకు ఒకే సమయంలో ప్రిపరేషన్‌ పూర్తవుతుంది. 

EIL Posts : ఈఐఎల్‌లో వివిధ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు.. పోస్టుల వివ‌రాలు..

అప్లికేషన్స్, కాన్సెప్ట్స్‌

ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లకు అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌­తో ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వ­యం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా చదివే సమయంలోనే ముఖ్యమైన ఫార్ములాలు,కీ పాయింట్స్‌ను షార్ట్‌ నోట్స్‌గా రూపొందించుకోవాలి. ఇది ఇంటర్, జేఈఈ–మెయిన్‌ రెండు పరీక్షల రివిజన్‌ పరంగా ఎంతో కలిసొస్తుంది. ఇంటర్‌ సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయి అవగాహనతో జేఈఈ–మెయిన్‌లోనూ ఉత్తమ ప్రతిభ చూపేందుకు అవకాశం ఉంటుంది.

ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌

ఇంటర్, జేఈఈ–మెయిన్‌ రెండు పరీక్షల్లో రాణించేందుకు ప్రాక్టీస్‌ అత్యంత కీలకం. ప్రతిరోజు తాము చదివిన టాపిక్‌కు సంబంధించి అందులోంచి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉన్న అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. వాస్తవానికి జేఈఈ–మెయిన్‌ సిలబస్‌లో ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ టాపిక్స్‌కు సమ ప్రాధాన్యం ఉంటోంది. కాబట్టి విద్యార్థులు రెండు సంవత్సరాల సిలబస్‌పై పట్టు సాధించేలా కృషి చేయాలి.

APSRTC Trade Apprentice : ఏపీఎస్‌ఆర్‌టీసీలో ట్రేడ్‌ అప్రెంటీస్‌ శిక్షణకు దరఖాస్తులు

సిలబస్‌ అనుసంధానం

జేఈఈ–మెయిన్‌ విద్యార్థులు.. మొదటి, ద్వితీ­య సంవత్సరం సిలబస్‌ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ప్రతి చాప్టర్‌కు సంబంధించి మొదటి సంవత్సరం అంశాలతోనూ సమన్వయం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. ఫలితంగా సంబంధిత అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే నైపుణ్యం సొంతమవుతుంది. 

న్యూమరికల్‌ ప్రశ్నలకు

జేఈఈ–మెయిన్‌ ప్రిపరేషన్‌లో భాగంగా విద్యార్థులు న్యూమరికల్‌ టైప్‌ కొశ్చన్స్‌ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. జేఈఈ–మెయిన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌.. ఈ మూడు సబ్జెక్ట్‌ల నుంచీ అయిదు ప్రశ్నలు చొప్పున న్యూమరికల్‌ ఆధారిత ప్రశ్నలు అడగనున్నారు. కాబట్టి విద్యార్థులు అప్లికేషన్‌ ఆధారిత ప్రిపరేషన్‌తోపాటు ఆయా సబ్జెక్ట్‌లలో న్యూమరిక్స్‌ ఆధారంగా సమాధానం సాధించాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

PJTSAU Admissions: వ్యవసాయ కోర్సులకు మూడో దశ కౌన్సెలింగ్‌.. కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

మాక్‌ టెస్ట్‌లు

జేఈఈ–మెయిన్, ఇంటర్మీడియెట్‌ల విద్యార్థులు మాక్‌ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది. అదే విధంగా ఇంటర్‌ ప్రీ–ఫైనల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం ద్వారా ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకోవచ్చు. జనవరి సెషన్‌కు హాజరయ్యే విద్యార్థులు అధిక సమయాన్ని పునశ్చరణకు, వీక్లీ టెస్ట్‌లకు, మాక్‌ టెస్ట్‌లకు కేటాయించాలి. 

టైమ్‌ మేనేజ్‌మెంట్‌

విద్యార్థులు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంతో ముఖ్యమని గుర్తించాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివే విధంగా సమయం కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండు గంటలు అధ్యయనం చేయాలి. తమకు బాగా సులభమైన సబ్జెక్ట్‌కు కొంత తక్కువ సమయం కేటాయించి.. క్లిష్టంగా భావించే సబ్జెక్ట్‌లకు కొంత ఎక్కువ సమయం చదవాలి. క్లిష్టంగా భావించిన సబ్జెక్ట్‌లు, అంశాల విషయంలోనూ కనీసం బేసిక్‌ ఫార్ములాలు తెలుసుకోవాలి. అంతకుముందు రోజు చదివిన అంశాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకునే విధంగా కనీసం పది నిమిషాలు కేటాయించాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ఏప్రిల్‌ సెషన్‌

ఏప్రిల్‌లో నిర్వహించే రెండో సెషన్‌కు అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. జనవరి సెషన్‌లో సరైన స్కోర్‌ సాధించని వారు ఏప్రిల్‌ సెషన్‌కు హాజరవుతున్నారు. డిసెంబర్‌లో ఇంటర్‌ సిలబస్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఆ తర్వాత సమయంలో జేఈఈ–మెయిన్‌ పరీక్ష సిలబస్‌ను పరిశీలించి.. దానికి అనుగుణంగా ఫిబ్రవరి చివరి వారం వరకు ప్రిపరేషన్‌ సాగించాలని నిపుణులు సూచిస్తున్నా­రు. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత జేఈఈ–మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ తేదీకి మధ్య ఉన్న వ్యవధిని పూర్తిగా రివిజన్, మాక్‌ టెస్ట్‌ల ప్రాక్టీస్‌కు కేటాయించాలి.

లోపాలు అధిగమిస్తూ

జేఈఈ–మెయిన్‌ జనవరి సెషన్‌కు హాజరై ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేక పోయిన విద్యార్థులు ఏప్రిల్‌ సెషన్‌కు హాజరవుతారు. ఈ విద్యార్థులు జనవరి సెషన్‌లో తాము చేసిన పొరపాట్లను గుర్తించి..వాటిని సరిదిద్దుకోవాలి. జనవరి సెషన్‌ ‘కీ’ ఆధారంగా, తమ ఆన్సర్‌ షీట్లను పరిశీలించుకోవాలి. తద్వారా తాము ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలి. 

ముఖ్య సమాచారం

     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
     జనవరి సెషన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024,నవంబర్‌ 22
     అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు నుంచి
     జనవరి సెషన్‌ పరీక్ష తేదీలు: 2025 జనవరి 22 నుంచి 31 వరకు
     ఫలితాల వెల్లడి: 2025, ఫిబ్రవరి 12
Executive Posts : మెకాన్‌ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
     రెండో సెషన్‌ దరఖాస్తు తేదీలు: 
2025 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు
     రెండో సెషన్‌ పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు
     రెండో సెషన్‌ ఫలితాల వెల్లడి: 2025 ఏప్రిల్‌ 17.
     వెబ్‌సైట్‌: https://jeemain.nta.ac.in

సబ్జెక్ట్‌ వారీగా ముఖ్యమైన అంశాలు

మ్యాథమెటిక్స్‌

ఈ సబ్జెక్ట్‌లో రెండు సంవత్సరాల సిలబస్‌కు సంబంధించి ప్రతి చాప్టర్‌ను తప్పనిసరిగా ప్రాక్టీస్‌ చేయాలి. ముఖ్యంగా 3–డి జామెట్రీ,కో ఆర్డినేట్‌ జామెట్రీ, వెక్టా­ర్‌ అల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్‌ నెంబర్స్, పారాబోలా, ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్‌పై పట్టు సాధించాలి. వీటితోపాటు క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్‌ ఈ క్వేషన్స్,పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్, బైనామియల్‌ థీరమ్,లోకస్‌ అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.

ఫిజిక్స్‌

విద్యార్థులు కొంత క్లిష్టంగా భావించే ఫిజిక్స్‌లో న్యూమరికల్‌ అప్లికేషన్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్‌ వేవ్స్‌పై పట్టు సాధించాలి. సెంటర్‌ ఆఫ్‌ మాస్, మొమెంటమ్‌ అండ్‌ కొలిజన్, సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌­పై అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రిపరేషన్‌ సమయంలోనే ఆయా అంశాల ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ అధ్యయనం చేయాలి.

Foreign Education: విదేశీ విద్యపై అవగాహన పెరగాలి

కెమిస్ట్రీ

విద్యార్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్‌.. కెమిస్ట్రీ. ఇందులో మెరుగైన సన్నద్ధత పొందితే స్కోర్‌ పెంచుకునే అవకాశం ఉంది. కెమిస్ట్రీలో అడిగే ప్రశ్నలు కెమికల్‌ బాండింగ్, పిరియాడిక్‌ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాల నైపుణ్యాలను తెలుసుకునే విధంగా ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.  

#Tags