JoSAA 2024 : జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ 2024 (జోసా) కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం!

JoSAA 2024 : జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ 2024 (జోసా) కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థ (జీఎఫ్‌టీఐ)లలో కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. 10 నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించనుంది.

17 వరకు మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఆ తర్వాత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. మొత్తం ఐదు రౌండల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జూలై 23 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 2024–25 విద్యాసంవత్సరానికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో మొత్తం 57,152 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు జోసా సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. 

Also Read : ‘జోసా’ సీట్ల కేటాయింపు.. మీ సీటు ఎక్కడ వచ్చిందో తెలుసుకోండి ఇలా..

గణనీయంగా పెరిగిన సీట్లు.. 
గత ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో గణనీయంగా సీట్ల సంఖ్య పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, ఉపాధి అవకాశాలతో ఇంజనీరింగ్‌కు డిమాండ్‌ ఏర్పడింది. అయితే 2019 ముందు వరకు అత్యున్నత ప్రమాణాలతో నడిచే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టు సీట్ల సంఖ్య ఉండేది కాదు. దీంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లిపోయేవారు.

Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh Telangana

#Tags