ఇంటర్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ పరీక్షలకు సూచనలు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు త్వరలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలు కీలకమైనవి. రసాయన శాస్త్రం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా క్వాలిటేటివ్ అనాలిసిస్/ గుణాత్మక విశ్లేషణలో వివధ రకాల అయాన్‌లను నిర్ధరించే పరీక్షల్లో రసాయన చర్యలను గమనించాలి. దీనికి సంబంధించి వైవాలో ప్రశ్నలు అడిగేందుకు అవకాశముంది.
| అంశం | మార్కులు |
1. | క్వాలిటేటివ్ అనాలిసిస్ (కేటయాన్, ఆనయాన్) | 10 |
2. | వాల్యూమెట్రిక్ అనాలిసిస్ | 8 |
3. | ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ లేదా ప్రిపరేషన్ అఫ్ కొల్లాయిడ్స్ లేదా క్రొమటోగ్రఫీ లేదా క్వాలిటేటివ్ టెస్ట్ ఆఫ్ కార్బో హైడ్రేట్స్/ప్రొటీన్స్ | 6 |
4. | వైవా | 2 |
5. | ప్రాజెక్టు వర్క్+రికార్డులు | 2+2 |
| మొత్తం | 30 |
- రసాయనాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరమైతే నిర్ధరణ పరీక్షను ఇన్విజిలేటర్‌కు చూపించాలి.
- ఒకసారి ఇచ్చిన సాల్ట్‌ను మళ్లీ ఇవ్వరు కాబట్టి, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
- వాల్యూమెట్రిక్ అనాలిసిస్/ఘన పరిమాణాత్మక విశ్లేషణలో ్ఛఛీ ఞౌజ్టీ, జీఛీజీఛిౌ్చ్టట లను జాగ్రత్తగా గమనించాలి. విద్యార్థి ఫలితంలో ఇచ్చిన కచ్చితత్వం ఆధారంగా మార్కులు ఇస్తారు.కాబట్టి టైట్రేషన్ జాగ్రత్తగా చేయాలి.
- సెక్షన్-3లో నాలుగు రకాల ప్రశ్నల్లో ఏదో ఒకటి మాత్రమే అడుగుతారు. కళాశాలలో ప్రాక్టీస్ చేసిన వాటినే అడుగుతారు కాబట్టి ఆందోళన అనవసరం.
- పాజెక్ట్ వర్క్, రికార్డులను విధిగా సర్టిఫై చేయించుకొని, పట్టికలన్నీ పూరించాలి.
- ఎక్కువగా విద్యార్థులు వైవా గురించి ఆందోళన చెందుతారు. కానీ, ఇందులో అడిగే ప్రశ్నలు రెండేళ్లలో చదివిన అంశాలు, ప్రాక్టికల్స్‌లో మీరు చేసిన అంశాలకు సంబంధించి ఉంటాయి.
- బున్‌సెన్ బర్నర్, గ్లాస్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. గాఢ రసాయనాలు శరీరంపై పడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే ఇన్విజిలేటర్‌కు చెప్పాలి.
- విద్యార్థి పరీక్ష గదిలోకి చేరుకున్న తర్వాత మొదట వాల్యూమెట్రిక్ ప్రొసీజర్ రాయాల్సి ఉంటుంది. అందువల్ల దీన్ని విధిగా నేర్చుకోవాలి. ప్రిన్సిపుల్, ఉపకరణాలు, ఇండికేటర్, రఫ్ టేబుల్ కచ్చితంగా ఉండేలా చూడాలి.
- టి.కృష్ణ, సీనియర్ ఫ్యాకల్టీ.
#Tags