కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల దగ్గర సిద్ధంగా ఉన్నాయని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్థులు కాలేజీలకు వెళ్లి వాటిని తీసుకోవచ్చని సూచించారు. అన్ని యాజమాన్యాల కళాశాలల ప్రిన్సిపాళ్లు అందరూ అక్టోబర్ 15లోపు విద్యార్థులందరికీ ఆ సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
#Tags