175 కేంద్రాల్లో విట్-జేఈఈ పరీక్ష

సాక్షి, అమరావతి బ్యూరో: దేశ వ్యాప్తంగా 124 నగరాల్లోని 175 పరీక్ష కేంద్రాల్లో విట్ జేఈఈ -18 నిర్వహిస్తున్నట్లు వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) ఏపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ ఏప్రిల్ 4న ఒక ప్రకటనలో తెలిపారు.
రానున్న విద్యాసంవత్సరానికి విట్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా 2 లక్షల 12 వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 4 న ప్రారంభమైన ఈ పరీక్షలు 15 వరకు జరగుతాయని తెలిపారు. విదేశాల్లో పరీక్షలు రాసే విద్యార్థుల కోసం దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు ఆయన వెల్లడించారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 33,139 మంది, తెలంగాణ నుంచి 18,937 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని.. ఆన్‌లైన్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విశ్వనాథన్ తెలిపారు. పరీక్ష ఫలితాలు www.vit.ac.in  లో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
#Tags