TS ICET 2024: టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

కేయూ క్యాంపస్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం (2024–2025)లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును మే 7వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు టీఎస్‌ఐసెట్‌ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రొఫెసర్‌ ఎస్‌.నర్సింహాచారి మే 1న‌ తెలిపారు.

గత నెల 30న గడువు ముగియడంతో మరోసారి పెంచినట్లు పేర్కొన్నారు. రూ.250 అపరాధ రుసుముతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుముతో 27 వరకు ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.

దరఖాస్తు చేసిన అభ్యర్థులు దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు, పొరపాట్లు సరిదిద్దుకునేందుకు మే 17 నుంచి 20 వరకు అవకాశం ఉందని, 28వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని నర్సింహాచారి వెల్లడించారు.

టీఎస్‌ ఐసెట్‌ రెండు సెషన్‌లలో ఉంటుందని, జూన్‌ 5న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ జరుగుతుందని తెలిపారు.

Also Read: ICET - ANALYTICAL ABILITY | MATHEMATICAL ABILITY | COMMUNICATION ABILITY | COMPUTER TERMINOLOGY | PREVIOUS PAPERS | MODEL PAPERS

జూన్‌ 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మరో సెషన్‌లో కూడా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్‌ 15న ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తామని చెప్పారు.

‘కీ’పై అభ్యంతరాలు జూన్‌ 16 నుంచి 19 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. టీఎస్‌ఐసెట్‌ ఫలితాలను జూన్‌ 28న విడుదల చేస్తామని పేర్నొన్నారు.

టీఎస్‌ఐసెట్‌కు ఇప్పటివరకు 73 వేల వరకు దరఖాస్తులొచ్చాయని సమాచారం. గడువు పొడిగింపుతో ఈ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. 

#Tags