Success Story : కోచింగ్ లేకుండానే.. గ్రూప్-2 ఉద్యోగం కొట్టానిలా..
అలాగే నా చిన్ననాటి కల ప్రభుత్వ ఉద్యోగం సాధించడం. లక్ష్యానికి అనుగుణంగా కష్టపడి చదివి.. గ్రూప్-2లో విజయం సాధించిన మల్లెల శ్రావ్యరెడ్డితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..
ప్రశ్న. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి ?
జవాబు: నాన్న మల్లెల వెంకటరెడ్డి రిటైర్డ్ వీలేజ్ రెవెన్యూ ఆఫీసర్. అమ్మ కరుణ శ్రీ గృహిణీ. నేను, తమ్ముడు.
Success Story: వేలల్లో వచ్చే జీతం కాదనీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..
Success Story: ఫస్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..
ప్రశ్న. మీ విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జవాబు: మాది మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని మద్దూరు. పాఠశాల విద్య కొత్తకోటలో జరిగింది. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్ హైదరాబాద్ లో పూర్తి చేశాను.
ప్రశ్న. మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేశారు ?
జవాబు: నా చిన్నతనంలోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించి పేదలకు సేవ చేయాలనే కోరిక ఉండేది. అందుకే ఇంజినీరింగ్ పూర్తి కాగానే జాబ్ చేయాలనే ఆలోచన లేకుండా వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను.
ప్రశ్న. రోజుకు ఎన్ని గంటలు చదివేవారు..?
జవాబు: నేను ఎటువంటి కోచింగ్ కి వెళ్లకుండా సొంతంగా ప్రిపర్ అయ్యాను. నా ప్రిపరేషన్ సివిల్స్ తో సమానంగా సాగింది. ప్రతి రోజూ 16 నుంచి 18 గంటలు చదివేదాన్ని. సిలబస్ లో ఉన్న అన్ని సబ్జెక్ట్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకుని, ఒకటికి రెండుసార్లు రివిజన్ చేశాను.
ప్రశ్న. మీ రోల్ మోడల్ ఎవరు..?
జవాబు: నాన్న వీఆర్వో కావడంతో చాలా బిజీగా ఉండేవారు.. కానీ బాగా చదవాలి అని ప్రోత్సాహించారు. అలాగే అమ్మ నేను చదివే సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకుండా అన్ని పనులు ఆమె చేసేవారు. మా మామయ్య వెంకటేశ్వర్ రెడ్డి గ్రూప్ 2 సాధించి ఎక్సైజ్ సీఐగా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన, దగ్గరి బంధువైన నరేందర్ అన్నయ్య నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. వాళ్లే నాకు రోల్ మోడల్.
ప్రశ్న. ఇంటర్వ్యూకి ఎలా సన్నద్ధమయ్యారు..?
జవాబు: ప్రవేశ పరీక్ష ఫలితాల అనంతరం క్వాలిఫై అయిన నా స్నేహితులతో కలిసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను. మాలో ప్రతి ఒక్కరు ఇంకోకరిని ఇంటర్వ్యూ చేసుకునేవాళ్లం. దాంతో ప్యానెల్లో సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు భయపడకుండా ధైర్యంగా సమాధానాలు చెప్పగలిగాను.
కూలీ పనిచేస్తూ..ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..
Success Story: ఈ పరిస్థితులే.. నన్ను నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేశాయ్..
ప్రశ్న. మీరు ఏఏ పుస్తకాలు చదివారు..?
జవాబు: తెలుగు అకాడమీ బుక్స్ తో పాటు విజేత కాంపిటీషన్ బుక్స్ చదివాను.
ప్రశ్న. గ్రూప్స్ రాయాలనుకునేవారికి మీరిచ్చే సలహా ఏమిటి ?
జవాబు: గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్లు కచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కి ఒకే బుక్‌ని ఫాలో అవడం మంచిది. కానీ దాన్ని పూర్తిగా చదవాలి. అలాగే ఇంతకుముందు తెలిసిన వాళ్లేవరైన గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యి ఉంటే, వారి గైడెన్స్ తీసుకోవడం చాలా మంచిది. కానీ ఇద్దరు, ముగ్గురిది కాకుండా మీకు నమ్మకం ఉండే ఒక్కరి గైడెన్స్ మాత్రమే తీసుకోవాలి.
జవాబు. మీ లక్ష్యం ఏమిటి ?
జవాబు: గ్రూప్-1 ఉద్యోగం సాధించి, పేదవారికి సహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను.
DSP Snehitha : గ్రూప్–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా
Y.Obulesh, Group 1 Ranker : ప్రభుత్వ స్కూల్‌లో చదివా...ప్రభుత్వ ఉద్యోగం కొట్టానిలా..
గ్రూప్–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్.. ఆర్‌టీఓగా ఉద్యోగం
Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..
గ్రూప్–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్.. ఆర్‌టీఓగా ఉద్యోగం