Physical Science for Competitive Exams : జలాంతర్గామి పనిచేయడంలో ఉపయోగించే సూత్రం ఏది?
ద్రవ పదార్థాలు
పీడనం (PRESSURE)
ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించే బలాన్ని పీడనం అంటారు.
పీడనం
ప్రమాణాలు:
1. డైన్ / సెం.మీ.2
2. న్యూటన్ / మీ2
3. 1 పాస్కల్
4. BAR
5. TORR
☛ ఒక ప్రవాహిని వల్ల (ద్రవాలు, వాయువులు) కలిగే పీడనం P = hdg
h → ప్రవాహి ఎత్తు
d → ప్రవాహి సాంద్రత
g → భూమి గురుత్వ త్వరణం
☛ ఒక వస్తువుతో కలిగించే పీడనం, దాని వైశాల్యాని(అడ్డుకోత వైశాల్యం)కి విలోమానుపాతంలో ఉంటుంది.
కాబట్టి వస్తువుల అడ్డుకోత వైశాల్యం తగ్గితే వాటి వల్ల కలిగే పీడనం పెరుగుతుంది.
ఉదాహరణ:
☛ కత్తి, కత్తెరల అంచులను నునుపుగా తయారు చేయడం వల్ల వాటి వల్ల కలిగే పీడనం పెరుగుతుంది.
☛ సూది, దబ్బనం, గడ్డపార, మేకు, మొదలైన వాటి అడ్డుకోత వైశాల్యాలను తగ్గించడం వల్ల వీటి వలన కలిగే పీడనం
ఎక్కువగా ఉంటుంది.
☛ మానవుడు నేల మీద నిలుచున్నప్పుడు అధిక పీడనాన్ని కలుగజేస్తాడు.
☛ వెడల్పైన పాత్రలో ఉండే ద్రవాన్ని పొడవైన, తక్కువ వ్యాసం ఉన్న పాత్రలో పోసినప్పుడు ద్రవస్తంభ పొడవు పెరగడంతో ఆ ద్రవం వల్ల కలిగే పీడనం కూడా పెరుగుతుంది.
☛ సమాన ఘనపరిమాణం ఉన్న మూడు భిన్న పాత్రల్లో వరసగా పాదరసం (Hg), నీరు (H2O), ఆల్కహాల్ నింపారు. వీటిలో పాదరస సాంద్రత, నీటిసాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి సాంద్రతలు ఆల్కహాల్ సాంద్రత కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాదరసం వల్ల కలిగే పీడనం ఎక్కువగా, నీటి పీడనం తక్కువగా, ఆల్కహాల్ పీడనం కనిష్టంగా ఉంటాయి.
Business Rankings: వ్యాపారం చేయడం సులభమైన జాబితాలో టాప్ 10లో ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ
భారమితి
ఒక ప్రదేశంలో ఉండే వాతావరణ పీడనాన్ని కొలవడానికి భారమితిని ఉపయోగిస్తారు. దీన్ని టారిసెల్లీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
పనిచేసే విధానం:
భారమితి ఎత్తు 100 సెం.మీ., వ్యాసం 1 సెం.మీ. దీనిలో పాదరసాన్ని ఉపయోగిస్తారు.
☛ సాధారణ వాతావరణ పీడనం పాదరస మట్టం 76 సెం.మీ. లేదా 760 మి.మీ.
ఫలితాలు:
☛ ఒక ప్రదేశంలో భారమితిలోని పాదరస స్తంభం పొడవు అకస్మాత్తుగా తగ్గితే రాబోయే తుపాన్‌ను, క్రమక్రమంగా తగ్గితే రాబోయే వర్షాన్ని సూచిస్తుంది.
☛ భారమితిలో తగ్గిన పాదరస మట్టం క్రమక్రమంగా పెరిగితే అక్కడ మారిన వాతావరణ పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని అర్థం.
☛ భారమితి ఎత్తు, దానిలో ఉపయోగించే ద్రవ సాంద్రతకు విలోమాను΄ాతంలో ఉంటుంది.
P = hdg
☛ ద్రవ సాంద్రత తగ్గితే భారమితిలోని ద్రవ మట్టం పెరుగుతుంది.
నోట్: ఇంక్ ఫిల్లర్స్, గాలిపంపులు, స్ట్రాలు వాతావరణ పీడనాన్ని అనుసరించి పనిచేస్తాయి.
1. పర్వతాలు ఎక్కినప్పుడు ముక్కు నుంచి రక్తం కారడం, వాంతులు కావడానికి ప్రధాన కారణం.. వాతావరణ పీడనం కంటే రక్తపీడనం ఎక్కువగా ఉండటం.
2. విమానాల్లో ప్రయాణించేటప్పుడు బాల్‌పెన్‌లోని ఇంక్ బయటకి రావడానికి కారణం– వాతావరణ పీడనం కంటే పెన్నులోని పీడనం ఎక్కువగా ఉండటం.
నోట్:
1. పాదరసం సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల దానితో పనిచేసే భారమితి ఎత్తు 1 మీ. ఉంటుంది.
2. నీటితో పనిచేసే భారమితి ఎత్తు నీటి సాంద్రతను బట్టి 10 మీ. నుంచి 11 మీ. ఉంటుంది. ఆల్కహాల్‌తో పనిచేసే భారమితి ఎత్తు 13.6 మీటర్లు.
3. ప్రయోగశాలలో ఉపయోగించే ఫోర్టీన్ (FORTINE) భారమితి ఎత్తు 80 సెం.మీ., దీనిలో పాదరసం వాడతారు.
4. అనార్ధ్ర భారమితిలో ఉండే వివిధ పరికరాలన్నీ ఘన స్థితిలో మాత్రమే ఉంటాయి.
బాయిల్ నియమం
స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న వాయువు ఘనపరిమాణం, దానిపై ప్రయోగించిన పీడనానికి విలోమానుపాతంలో
ఉంటుంది.
ఉదాహరణ:
1. నీటి అడుగు భాగంలో ఉండే గాలి బుడగ ఉపరితలం పైకి చేరినప్పుడు గాలిపై నీటి వల్ల కలిగే పీడనం ఉండదు. కాబట్టి గాలి బుడగపై పనిచేస్తున్న పీడనం తగ్గడం వల్ల దాని ఘనపరిమాణం పెరుగుతుంది.
2. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే బెలూన్‌పై ఉండే వాతావరణ పీడనం తగ్గడం వల్ల ఆ బెలూన్ పరిమాణం పెరుగుతుంది.
3. చంద్రుడిపై ఎలాంటి వాతావరణం లేదు. కాబట్టి అక్కడ బెలూన్ పైకి ఎగరదు.
School Students : టీచర్ బదిలీపై విద్యార్థుల ఆందోళన.. ఎంఈఓ స్పందిస్తూ..
పాస్కల్ నియమం
ఒక ప్రవాహినిపై కలిగించే పీడనం అన్ని వైపులా సమానంగా విభజితమవుతుంది.
అనువర్తనాలు:
1. బట్టలు, కాగితాలను అదిమి పట్టడానికి ఉపయోగించే ‘బ్రామాప్రెస్’ సాధనం ΄ాస్కల్ నియమం ఆధారంగా పనిచేస్తుంది.
2. వ్యవసాయ రంగంలో ఉపయోగించే స్ప్రేయర్ ఈ నియమం ఆధారంగా పనిచేస్తుంది. ఈ సాధనాన్ని ఉపయోగించి క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తారు.
3. హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ పంపులు, హైడ్రాలిక్ క్రేన్లు, టిప్పర్లు, సాధనాలు, ఎయిర్ బ్రేక్‌లు ΄ాస్కల్ నియమం ఆధారంగానే పనిచేస్తాయి.
స్నిగ్ధత వివరణ
☛ సమాన ద్రవ్యరాశులు ఉన్న పక్షి ఈక, ఒక రాయిని ఒకే ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు, ఆ రాయి వాతావరణంలోని స్నిగ్ధతా బలాలను తొందరగా అధిగమించడం వల్ల ఈక కంటే ముందుగా భూమిని చేరుతుంది. ఒకవేళ ఈ రెండు వస్తువులను ఒకే ఎత్తునుంచి ఒకేసారి శూన్యంలో జారవిడిచినప్పుడు అవి రెండూ ఒకేసారి భూమిని చేరుతాయి. కారణం.. శూన్యంలో ఎలాంటి స్నిగ్ధతా బలాలు ఉండవు.
☛ అన్ని ద్రవ పదార్థాల కంటే గ్రీజు స్నిగ్ధత స్థానం ఎక్కువగా ఉంటుంది. తేనె స్నిగ్ధత కూడా ఎక్కువగా ఉంటుంది.
నోట్ :
1. స్నిగ్ధత.. పీడనంపై ఆధారపడుతుంది.
2. ఉష్ణోగ్రత పెరిగితే వాయువుల స్నిగ్ధత
పెరుగుతుంది.
3. ఉష్ణోగ్రత పెరిగితే ద్రవాల స్నిగ్ధత తగ్గుతుంది.
4. గాలిలో ఉన్న స్నిగ్ధతా బలాల కంటే నీటిలోని స్నిగ్ధతా బలాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక వస్తువు భారం గాలిలో కంటే నీటిలో తక్కువగా ఉంటుంది.
స్నిగ్ధత మారడానికి కారణాలు
☛ ద్రవ పదార్థాలను వేడి చేసినప్పుడు ద్రవాణువుల మధ్య ఉండే సంసంజన బలాలు బలహీనపడి స్నిగ్ధత తగ్గిపోతుంది.
☛ వాయువులను వేడిచేసినప్పుడు వాటి అనుచలనం పెరిగి అవి పరస్పరం ఒకదానికి మరొకటి దగ్గరగా రావడంతో స్నిగ్ధత బలం పెరుగుతుంది.
Job Mela in Govt Degree College : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి జాబ్ మేళా.. ఈ తేదీకే..!
గతంలో అడిగిన ప్రశ్నలు
1. జతపరచండి.
i. బలం 1. పాయిజ్
ii. ప్రచోదనం 2. పాస్కల్
iii. స్నిగ్ధత 3. న్యూటన్
iv. పీడనం 4. న్యూటన్ – సెకన్
i ii iii iv
ఎ) 1 2 3 4
బి) 3 4 1 2
సి) 2 1 4 3
డి) 4 3 2 1
2. తలతన్యత అనువర్తనం.
1. వేడి ఆహారం చల్లని ఆహారం కంటే రుచిగా ఉండడం
2. వర్షం చినుకులు, సబ్బు బుడగ, పాదరస బిందువులు గోళాకారంలో ఉండడం
3. రంగులు, ల్యూబ్రికెంట్ సులభంగా విస్తరించడానికి అవసరం
4. నిలకడగా ఉన్న నీటిపై దోమలు స్వే చ్ఛగా చలించడం
ఎ) 2, 4 బి) 2 మాత్రమే
సి) 2, 3, 4 డి) అన్నీ
3. సమాన ద్రవ్యరాశి ఉన్న ఒక ఆస్ట్రిచ్ పక్షి ఈక, 100 గ్రాముల రాయిని భూమికి 200 మీటర్లు ఎత్తు నుంచి ఒకేసారి జారవిడిచినప్పుడు వాతావరణ పొరలోని స్నిగ్ధతా బలాల వల్ల అవి....
ఎ) రెండూ ఒకేసారి భూమిని చేరుతాయి
బి) రాయి ముందుగా భూమి చేరుతుంది
సి) పక్షి ఈక ముందుగా చేరుతుంది
డి) రెండూ స్నిగ్ధతా బలాల వల్ల భూమిని చేరవు
4. సమాన ద్రవ్యరాశి ఉన్న ఒక ఆస్ట్రిచ్ పక్షి ఈకను 100 గ్రా. రాయిని 200 మీ. ఎత్తునుంచి ఒకేసారి శూన్యంలో జారవిడిచినప్పుడు...
ఎ) రెండూ ఒకేసారి భూమిని చేరుతాయి
బి) రాయి ముందుగా చేరుతుంది
సి) పక్షి ఈక ముందుగా చేరుతుంది
డి) రెండూ స్నిగ్ధతా బలాల వల్ల భూమిని చేరవు
5. కింది వాటిలో సరైనది.
1. ద్రవాల తలతన్యత ఉష్ణోగ్రతకు విలోమాను పాతంలో ఉంటుంది.
2. సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ప్రతి ద్రవం తలతలన్యత శూన్యం.
ఎ) 1 సరైనది, 2 తప్పు
బి) 1 తప్పు, 2 సరైనది
సి) రెండూ సరికావు
డి) రెండూ సరైనవే
6. నిలకడగా ఉన్న నీటిపై కిరోసిన్‌ను వెదజల్లినప్పుడు దేనిలో మార్పు జరిగి దోమల గుడ్లు, లార్వాలు మునుగుతాయి.
ఎ) నీటి తలతన్యత తగ్గడం
బి) నీటి తలతన్యత పెరగడం
సి) నీటి స్నిగ్ధత పెరగడం
డి) నీటి స్నిగ్ధత తగ్గడం
7. కేశనాళికీయత అనువర్తనం కానిది
ఎ) కిరోసిన్ స్టవ్, దీపం, మైనం క్యాండిల్ పనిచేయడం
బి) ఇసుక నేలలు తేమగా ఉండడం
సి) ఎడారుల్లో ఒయాసిస్‌లు ఏర్పడటం
డి) మొక్కలు దారువు ద్వారా పీల్చుకున్న నీరు పైకి ఎగబాకడం
School Holiday Cancel : ఆరోజు స్కూళ్లకు సెలవు క్యాన్సెల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
8. జతపరచండి. (పదార్థాలు– స్పర్శకోణం)
i. పాదరసం 1. 0°
ii. స్వచ్ఛమైన నీరు 2. 8°– 9°
iii. వెండితో నీరు 3. 90°
iv. సాధారణ నీరు 4. 135° – 140°
i ii iii iv
ఎ) 2 3 4 1
బి) 4 1 3 2
సి) 1 4 2 3
డి) 3 2 1 4
9. 1. ఒక ప్రదేశంలో భారమితిలోని పాదరస స్తంభం పొడవు అకస్మాత్తుగా తగ్గితే అది తుపాను రాకను సూచిస్తుంది.
2. పాదరస మట్టం క్రమంగా తగ్గితే రాబోయే వర్షసూచనను తెలుపుతుంది.
ఎ) 1, 2 సరైనవి
బి) రెండూ తప్పు
సి) 1 సరైనది, 2 తప్పు
డి) 1తప్పు, 2 సరైనది
10. జలాంతర్గామి పనిచేయడంలో ఉపయోగించే సూత్రం?
ఎ) బాయిల్ నియమం
బి) పాస్కల్ నియమం
సి) బెర్నౌలీ నియమం
డి) ఆర్కిమిడిస్ ప్లవన సూత్రం
11. నదిలో ప్రయాణిస్తున్న ఓడ సముద్రజలాల్లోకి ప్రవేశించినప్పుడు ఓడ మట్టం పెరుగుతుంది. కారణం?
ఎ) సముద్ర నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం
బి) నది నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం
సి) నది నీటి సాంద్రత తక్కువగా ఉండటం
డి) సముద్ర నీటి సాంద్రత తక్కువగా ఉండటం
12. టారిసెల్లీ కనుగొన్న భారమితి దేన్ని కొలుస్తుంది?
ఎ) సాంద్రత బి) వాతావరణ పీడనం
సి) స్నిగ్ధత డి) నీటి అసంగత వ్యాకోచం
13. నీటిలో తేలే మంచు కరిగితే, నీటిమట్టం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) పెరిగి తగ్గుతుంది డి) మారదు
14. ప్రెషర్ కుక్కర్‌లో పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. ఎందుకు?
ఎ) ఉష్ణం తగ్గడం వల్ల
బి) ఉష్ణోగ్రత పెరగడం వల్ల
సి) నీటి బాష్పీభవన స్థానం పెరగడం వల్ల
డి) నీటి బాష్పీభవన స్థానం తగ్గడం వల్ల
సమాధానాలు
1) బి 2) డి 3) బి 4) ఎ 5) డి
6) ఎ 7) బి 8) బి 9) ఎ 10) డి
11) డి 12) బి 13) డి 14) సి
Guest Faculty Posts : ఎస్‌ఎస్‌సీటీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..