Rivers and their Flow Rate for Groups Exams : గ్రూప్స్‌ పరీక్షల్లో అత్యంత కీలకం.. నదులు జన్మసంస్థలాలు..!

భారత్‌ వ్యవసాయ ప్రధాన దేశం. వ్యవసాయానికి మూలాధారం సాగునీరు. ఈ నీటిని అందించడంలో నదులది కీలక పాత్ర.

ప్రధాన నదులైన గంగ, సింధూ, గోదావరి, కృష్ణా లాంటి నదుల జన్మస్థానాలు, ప్రవాహ గతికి సంబంధించిన సమాచారం గ్రూప్స్‌ పరీక్షల్లో అత్యంత కీలకం!!
సింధూ లేదా ఇండస్‌ 
దీని జన్మస్థానం టిబెట్‌లోని కైలాస పర్వతాల్లో ఉన్న ‘చాండుయాంగ్‌’ హిమానీనదం. ఈ నది డామ్‌ఛోక్‌ వద్ద దేశంలోకి ప్రవేశించి షిగార్, గిల్గిత్, డ్రాస్‌ తదితర ఉపనదులను కలుపుకొని పాకిస్తాన్‌లోకి ప్రవహిస్తుంది. సట్లెజ్, రావి, బియాస్, జీలం, చీనాబ్‌ నదులు సింధూ ముఖ్య ఉపనదులు. సట్లెజ్‌ నది కూడా కైలాస పర్వతాల్లోని ‘రాకాస్‌ తావ్‌’గా పిలిచే హిమానీనద సరస్సు నుంచి ఉద్భవిస్తుంది. ఈ నదిని ప్రాచీన కాలంలో ‘సుతుద్రి’ అని పిలిచేవారు. సట్లెజ్‌ నది హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘షిప్కిలా’ కనుమ ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తుంది.
సట్లెజ్‌పై భాక్రా నంగల్‌
సట్లెజ్‌ నదిపై హిమాచల్‌ప్రదేశ్‌లోని భాక్రా, పంజాబ్‌లోని నంగల్‌ వద్ద భారీ ఆనకట్టలు నిర్మించారు. భాక్రా నంగల్‌ భారత్‌లో అతి పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టుల్లో ఒకటి. భాక్రా నంగల్‌ రిజర్వాయర్‌ను ‘గోవింద సాగర్‌’గా పిలుస్తారు. జీలం నది కశ్మీర్‌లోని వెరినాగ్‌ కొండల్లో ఆవిర్భవిస్తుంది. చంద్ర–భాగా నదుల కలయికతో చీనాబ్‌ నది ఏర్పడింది. ఇవి హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహతాంగ్‌ కనుమ వద్ద ఆవిర్భవిస్తాయి.
Btech Results: బీటెక్‌ ఫలితాలు విడుదల.. రెగ్యులర్‌తో పాటు సప్లిమెంటరీ రిజల్ట్స్‌
కాలాబాగ్‌
రావి నది కులూ కొండల్లో, బియాస్‌ నది బియాస్‌కుండ్‌ వద్ద ఆవిర్భవించాయి. సిం«ధూ నదీ వ్యవస్థలో రావి–బియాస్‌ల సంగమం మాత్రమే భారతదేశంలో ఉంది. మిగిలిన నదులన్నీ ΄ాకిస్తాన్‌ భూభాగంలో ఒక దానితో మరోటి కలుస్తాయి. ఈ నదులన్నీ పాకిస్తాన్‌లోని ‘కాలాబాగ్‌’ వద్ద కలిసి, ఒకే ప్రవాహంగా సింద్‌ రాష్ట్రం ద్వారా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. రావి–బియాస్‌ నదులు పంజాబ్‌ (భారత్‌)లోని హరికే వద్ద కలుస్తాయి. ఇందిరాగాంధీ కాలువ హరికే వద్ద నిర్మించిన ఆనకట్ట నుంచి ప్రారంభమవుతుంది.
గోదావరి–త్య్రయంబకం
ద్వీపకల్ప నదీ వ్యవస్థలన్నింటి కంటే గోదావరి పెద్దది. ఇది సహ్యాద్రి పర్వతాల్లో నాసిక్‌ సమీపంలోని ‘త్య్రయంబకం’ వద్ద ఆవిర్భవించింది. ఈ నది మహారాష్ట్రకు చెందిన వార్ధా, పేన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, కోయనా, మధ్యప్రదేశ్‌కు చెందిన వైన్‌గంగను కలుపుకొని తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మానేరు, శబరి, మంజీరా నదులు గోదావరి ముఖ్య ఉపనదులు.
మంజీరాపై నిజాంసాగర్‌
మంజీరా నది మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ పర్యశ్రేణుల్లో ఆవిర్భవించింది. ఈ నది తెలంగాణలోని నిజామాబాద్, మెదక్‌ జిల్లాల్లో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. మంజీరాపై నిజాంసాగర్, సింగూరు ఆనకట్టలు నిర్మించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉద్భవించిన శబరి నది, ఖమ్మం జిల్లాలోని కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. గోదావరిపై నిజామాబాద్‌ జిల్లాలోని పోచంపాడు వద్ద శ్రీరాంసాగర్‌ ఆనకట్ట నిర్మించారు. గోదావరి రాజమండ్రికి దిగువన గౌతమీ గోదావరి, వశిష్ట గోదావరి, కైనతేయి గోదావరి అనే మూడు పాయలుగా చీలిపోతుంది. అనంతరం అంతర్వేది, యానాం, కొమరగిరి పట్నాల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
Hindi Day: నేడు హిందీ దినోత్సవం.. ఇది అధికారిక భాష ఎలా అయ్యింది?
కృష్ణానది

సహ్యాద్రి కొండల్లోని మహాబలేశ్వర్‌ వద్ద కృష్ణానది ఆవిర్భవించింది. ఇది కర్ణాటక ద్వారా  ప్రవహిస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లాలో మక్తల్‌ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఘటప్రభ, మల్లప్రభ, భీమా, తుంగభద్ర, దిండి, మూíసీ నదులు కృష్ణా నదికి ముఖ్య ఉపనదులు. తుంగభద్ర కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో ఆవిర్భవించి.. కర్నూలులోని  సంగమేశ్వర్‌ వద్ద కృష్ణలో కలుస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు దిగువన కృష్ణానది పాయలుగా  చీలి హంసలదీవి వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. 

#Tags