Telangana History Practice Test: ఆర్యులు దక్షిణాదిలో మొదట ఏ ప్రాంతంలోకి ప్రవేశించారు?
1. క్రీస్తు పూర్వం ఎన్నో శతాబ్దం నుంచి తెలంగాణకు సంబంధించి చారిత్రక యుగం ప్రారంభమవుతున్నట్లుగా చరిత్రకారులు పేర్కొన్నారు?
1) 5
2) 6
3) 7
4) 8
- View Answer
- సమాధానం: 2
2. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఆర్యులు ఎప్పటి నుంచి దక్షిణాపథానికి రావడం ప్రారంభించారు?
1) క్రీ.పూ. 900
2) క్రీ.పూ. 800
3) క్రీ.పూ. 700
4) క్రీ.పూ. 1000
- View Answer
- సమాధానం: 4
3. ‘దక్షిణాపథం’ గురించి కింద పేర్కొన్న ఏ కాలం నుంచి తెలుస్తోంది?
1) తొలివేద కాలం
2) మలివేద కాలం
3) ఉపనిషత్తులు
4) బౌద్ధ కాలం
- View Answer
- సమాధానం: 4
4. దక్షిణాది గురించి ప్రస్తావించిన ఆర్యుల తొలి గ్రంథాలేవి?
1) తొలి వేదాలు
2) మలి వేదాలు
3) బ్రాహ్మణాలు
4) ఉపనిషత్తులు
- View Answer
- సమాధానం: 3
5. ఆర్యులు దక్షిణాదిలో మొదట ఏ ప్రాంతంలోకి ప్రవేశించారు?
1) విదర్భ
2) పైఠాన్
3) ములక
4) అస్మక
- View Answer
- సమాధానం: 1
6. ‘మహాతలవర వాజ సమీక్ష సేవాప్రభ’ అనే వాక్యం ఉన్న గుర్రం బొమ్మ ఏ ప్రాంతంలో లభించింది?
1) ధూళికట్ట
2) కొండాపూర్
3) పెద్దబంకూరు
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 3
7.కింది వాటిలో పెద్ద ఆవాస ప్రాంతం ఏది?
1) పెద్దబంకూర్
2) కొండాపూర్
3) ధూళికట్ట
4) పాలకొండ
- View Answer
- సమాధానం: 1
8. కింది వాటిలో ‘టంకశాల’ పట్టణం ఏది?
1) ఏలేశ్వరం
2) కొండాపూర్
3) పెద్దబంకూర్
4) పాలకొండ
- View Answer
- సమాధానం: 2
9. తొలి శాతవాహన కాలానికి చెందిన ఒక ‘పోటీన్ సీసం–తగరం’ మిశ్రమ లోహపు నాణెం దొరికిన ప్రాంతం ఏది?
1) ఏలేశ్వరం
2) కొండాపూర్
3) పెద్దబంకూర్
4) పాలకొండ
- View Answer
- సమాధానం: 4
10. షోడశ జనపదాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన జనపదం ఏది?
1) అంగ
2) అవంతి
3) అస్మక
4) మగధ
- View Answer
- సమాధానం: 3
11. బుద్ధుడి సమకాలీకుడైన ‘సుజాతుడు’ ‘బోధన్’ను పాలించినట్లు కింది వాటిలో వేటి ద్వారా తెలుస్తోంది?
1) జైన గ్రంథాలు
2) బౌద్ధ వాజ్ఞ్మయం
3) మహాభారతం
4) వాయు పురాణం
- View Answer
- సమాధానం: 2
12. రుషభుడి కుమారుడైన ‘బాహుబలి’ బోధన్ ప్రాంతాన్ని పాలించినట్లు వేటి ద్వారా తెలుస్తోంది?
1) జైన గ్రంథాలు
2) బౌద్ధ వాజ్ఞ్మయం
3) మహాభారతం
4) రామాయణం
- View Answer
- సమాధానం: 1
13. బుద్ధుడి సమకాలీకుడు, కోసల దేశవాసి అయిన ‘బావరి’ క్రీ.పూ. 6వ శతాబ్దంలో ‘అస్సక (అస్మక)’ అనే ఆంధ్ర జనపథంలో స్థిరపడి విద్యాబోధన చేసినట్లు కింది వాటిలో దేని ద్వారా తెలుస్తోంది?
1) వాయు పురాణం
2) మహాభారతం
3) సుత్తనిపాతం
4) జైనగ్రంథాలు
- View Answer
- సమాధానం: 3
14. పాణిని ఏ కాలానికి చెందినవారు?
1) క్రీ.పూ. 600
2) క్రీ.పూ. 700
3) క్రీ.పూ. 800
4) క్రీ.పూ. 900
- View Answer
- సమాధానం: 1
15. అస్మక జనపథం రాజధాని ఏది?
1) బోధన్
2) పైఠాన్
3) అలక
4) గాంధార
- View Answer
- సమాధానం: 1
16. ‘ములక’ రాజ్య రాజధాని ఏది?
1) బోధన్
2) బాదనకుర్తి
3) పైఠాన్
4) ఛేది
- View Answer
- సమాధానం: 3
17. ‘వింధ్య పర్వతాల’ మీదుగా దక్షిణ భారతదేశానికి మార్గం కనుగొన్నవారెవరు?
1) సుజాతనుడు
2) బావరి
3) పాణిని
4) అగస్త్యుడు
- View Answer
- సమాధానం: 4
18. ‘తెలివాహ’ అంటే కృష్ణానది కాదని, అది గోదావరి అని; ‘ఆంధ్రనగరి’ అంటే ధాన్యకటకం కాదని, కోటిలింగాల అని పరిశోధనాత్మకంగా నిరూపించింది ఎవరు?
1) ఏటుకూరి బలరామమూర్తి
2) సంగనభట్ల నర్సయ్య
3) పి.వి. రామచంద్రమూర్తి
4) బి.ఎన్. శాస్త్రి
- View Answer
- సమాధానం: 2
19. మహిషిక రాజ్యం, మహిషిక ప్రజల ప్రస్తావన ఎందులో ఉంది?
1) సుత్తనిపాతం
2) జైన గ్రంథాలు
3) రామాయణం
4) మత్స్యపురాణం
- View Answer
- సమాధానం: 3
20. ‘నాగులు’ ఏ నదీ తీరంలో రాజ్యపాలన చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు?
1) గోదావరి
2) కృష్ణా
3) తుంగభద్ర
4) గంగా
- View Answer
- సమాధానం: 2
21. పైశాచీ భాష మాట్లాడే ‘దరదులు’ (పిశాచీలు) ఏ నదీ తీర వాసులు?
1) వక్షు
2) గోదావరి
3) కృష్ణా
4) గంగా
- View Answer
- సమాధానం: 1
22. తెలంగాణమే తెలుగు వారికి ఆది నివాసం, ఇక్కడి నుంచే వారు వివిధ ప్రాంతాలకు విస్తరించారని పేర్కొన్న పరిశోధకులెవరు?
1) సంగనభట్ల నర్సయ్య
2) పి. శ్రీరామశర్మ
3) ఆదిరాజు వీరభద్రరావు
4) ఆరుద్ర
- View Answer
- సమాధానం: 1
23. గ్రీకు రాయబారి మెగస్తనీస్ ‘ఇండికా’ గ్రంథం ప్రకారం ఆంధ్రుల దుర్గాల సంఖ్య?
1) 40
2) 20
3) 30
4) 50
- View Answer
- సమాధానం: 3
24.నల్గొండ జిల్లాలోని ‘ఇంద్రపురి (ఇంద్రపాల) నగరం’ నుంచి మౌర్యులు కప్పం వసూలు చేశారని పేర్కొన్న ప్రసిద్ధ చరిత్రకారుడు ఎవరు?
1) ఏటుకూరి బలరామమూర్తి
2) బి.ఎన్. శాస్త్రి
3) పి. శ్రీరామశర్మ
4) సంగనభట్ల నర్సయ్య
- View Answer
- సమాధానం: 2
25. నాణేలపై విశేష పరిశోధన చేసిన వారెవరు?
1) బి.ఎన్. శాస్త్రి
2) సంగనభట్ల నర్సయ్య
3) డాక్టర్ డి. రాజారెడ్డి
4) పి.వి. శ్రీరామశర్మ
- View Answer
- సమాధానం: 3
26. కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో లభించిన నాణేల ఆధారంగా శాతవాహనుల కంటే ముందే తెలంగాణలో స్థానిక పాలకులున్నారని చరిత్రకారులు పేర్కొన్నారు?
1) ఏలేశ్వరం
2) కోటిలింగాల
3) దేవరకొండ
4) కదంబపూర్
- View Answer
- సమాధానం: 2
27. భారతదేశంలో తొలిసారిగా నాణేలు ఎవరు వేశారు?
1) సమగోప
2) నారన
3) గోబద
4) సిరివయాస
- View Answer
- సమాధానం: 3
28. శాతవాహనుల కంటే ముందే తెలంగాణలో బౌద్ధమత వ్యాప్తి జరిగిందని, ఇక్కడ రాజ్యాలు ఉన్నాయని పేర్కొన్నవారెవరు?
1) సంగనభట్ల నర్సయ్య
2) బి.ఎన్. శాస్త్రి
3) పి. శ్రీరామశర్మ
4) వట్టికోట ఆళ్వార్‌స్వామి
- View Answer
- సమాధానం: 1
29. తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం కంటే ప్రాచీనమైన బౌద్ధ స్తూపం ఎక్కడ కనిపించింది?
1) ధూళికట్ట
2) మీరంపేట
3) కోటిలింగాల
4) కదంబపురం
- View Answer
- సమాధానం: 4
30. శాతవాహనుల కంటే ముందు క్రీ.పూ. 3వ శతాబ్దంలో కోటిలింగాలను ఏలిన స్థానిక పాలకుల్లో చివరివారెవరు?
1) గోబద
2) సమగోపుడు
3) సిరివయాస
4) కంవయాస
- View Answer
- సమాధానం: 2
31. శాతవాహన సామ్రాజ్యానికి మూల పురుషుడైన ‘సిముకుడు’ మొదట ఏ రాజు వద్ద ఉద్యోగిగా పనిచేశాడు?
1) సమగోపుడు
2) సిరివయాస
3) గోబద
4) కంవయాస
- View Answer
- సమాధానం: 1
32. శాతవాహనుల కంటే ముందే క్రీ.పూ. 300 నుంచి క్రీ.శ. 200 వరకు కింద పేర్కొన్న ఏ నగరం సిరిసంపదలతో తులతూగిందని చరిత్రకారుల అభిప్రాయం?
1) కోటిలింగాల
2) కొండాపురం
3) ఏలేశ్వరం
4) పెద్దబంకూర్
- View Answer
- సమాధానం: 2
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ‘తెలంగాణ చరిత్ర’ రచయిత
చరిత్ర పూర్వయుగం
1. బ్లేడు పనిముట్లు, ఎముక పనిముట్లు ఏ కాలం నాటి విశిష్టాంశాలు?
1) తొలి పాత రాతియుగం
2) మధ్య పాత రాతియుగం
3) మలి పాత రాతియుగం
4) మధ్య యుగం
- View Answer
- సమాధానం: 3
2. ఆహార సేకరణ, వేట అంశాలతో కూడిన ఆర్థిక వ్యవస్థ ఏ యుగంలో ఉంది?
1) పాత రాతియుగం
2) మధ్య రాతియుగం
3) కొత్త రాతియుగం
4) లోహ యుగం
- View Answer
- సమాధానం: 1
3. ఆహారోత్పత్తి ఏ యుగంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది?
1) పాత రాతియుగం
2) మధ్య రాతియుగం
3) కొత్త రాతియుగం
4) లోహ యుగం
- View Answer
- సమాధానం: 3
4. ‘మానవుడు–ప్రకృతికి మధ్య పరస్పర చర్య’ అనే ఆవిష్కరణ ఏ యుగంలో జరిగింది?
1) పాత రాతియుగం
2) మధ్య రాతియుగం
3) కొత్త రాతియుగం
4) లోహ యుగం
- View Answer
- సమాధానం: 3
5. కింది వాటిలో కొత్త రాతియుగానికి చెందిన పనిముట్ల తయారీ కేంద్రాలేవి?
1) పాలకొండ, దేవరపల్లి
2) కొలకొండ, తొగరాయి
3) కదంబాపురం, పాలకొండ
4) తొగరాయి, కదంబపురం
- View Answer
- సమాధానం: 4
6. మహబూబ్‌నగర్ జిల్లా ‘ఉత్నూరు’ వద్ద పేడకుప్పలు తగులబెట్టడం వల్ల ఏర్పడినట్లుగా భావిస్తున్న బూడిద ఏ కాలానికి చెందిందిగా చరిత్రకారులు గుర్తించారు?
1) క్రీ.పూ. 200
2) క్రీ.పూ. 300
3) క్రీ.పూ. 400
4) క్రీ.పూ. 500
- View Answer
- సమాధానం: 1
7.కొత్త రాతియుగంలో 13 రకాల మట్టిపాత్రలు లభించిన ప్రాంతం ఏది?
1) తొగరాయి
2) ఉత్నూరు
3) ఏలేశ్వరం
4) వర్ధమాన కోట
- View Answer
- సమాధానం: 2
8. ‘బృహత్ శిలాయుగం’గా ఏ యుగాన్ని పేర్కొంటారు?
1) పాత రాతియుగం
2) మధ్య రాతియుగం
3) కొత్త రాతియుగం
4) లోహ యుగం
- View Answer
- సమాధానం: 4
9. స్థిర వ్యవసాయం ఏ యుగంలో ఏర్పడినట్లు భావిస్తున్నారు?
1) పాత రాతియుగం
2) మధ్య రాతియుగం
3) కొత్త రాతియుగం
4) లోహ యుగం
- View Answer
- సమాధానం: 4
10. లోహ యుగ కాలంలో రాతి పూసల తయారీ కేంద్రం ఉన్న ప్రాంతం ఏది?
1) కొండాపూర్
2) దేవరకొండ
3) కొల్లాపూర్
4) కదంబపురం
- View Answer
- సమాధానం: 1
11. లోహ యుగానికి చెందిన వేల సమాధులు బయల్పడిన ప్రాంతం ఏది?
1) కొండాపూర్
2) నార్కట్‌పల్లి
3) తుమ్మలగూడెం
4) వేములకొండ
- View Answer
- సమాధానం: 2
12. ఏ ప్రాంతంలోని సమాధుల్లో ‘ఏనుగు’ ఆకారంలో ఉన్న పెట్టె లభించింది?
1) కొండాపూర్
2) నార్కట్‌పల్లి
3) ఏలేశ్వరం
4) కదంబపురం
- View Answer
- సమాధానం: 3
13. చరిత్రకారులు బృహత్ శిలాయుగం నాటి సమాధులు ఎన్ని రకాలుగా ఉన్నట్లు పేర్కొన్నారు?
1) 13
2) 12
3) 11
4) 10
- View Answer
- సమాధానం: 2
14.ఏ ప్రాంతంలో బయల్పడిన సమాధుల్లో ‘కత్తి’ లభించింది?
1) కొండాపూర్
2) నార్కట్‌పల్లి
3) ఏలేశ్వరం
4) మౌలాలి
- View Answer
- సమాధానం: 4
15. సమాధిలో కొడవలి ముక్క, రాగి గిన్నెలు కనిపించిన ప్రాంతం ఏది?
1) దోర్నకల్లు
2) మౌలాలి
3) ఏలేశ్వరం
4) నార్కట్‌పల్లి
- View Answer
- సమాధానం: 1
16. లోహయుగం నాటి అతి విస్తారమైన ఆవాస ప్రాంతం ఏది?
1) కదంబపూర్
2) బుడిగిపల్లి
3) పెద్దబంకూర్
4) నాంపల్లి
- View Answer
- సమాధానం: 3
17. ఏ ప్రాంతంలో బయల్పడిన శ్మశానంలో ‘ధాల్మెనాయిడ్’ శవ పేటికలు అధికంగా కనిపించాయి?
1) జానంపేట
2) కపరాలగూడ
3) పాల్వంచ
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
18. మైళ్ల దూరం విస్తరించిన శ్మశానం ఉన్న ప్రాంతం ఏది?
1) జానంపేట
2) కపరాలగూడ
3) పాల్వంచ
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
19. 30, 40 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన స్థలాలు కనిపించిన ప్రాంతం ఏది?
1) లింగంపల్లి
2) బోయిన్పల్లి
3) కూకట్పల్లి
4) మౌలాలి
- View Answer
- సమాధానం: 4
20. ఇనుము కరిగించే ప్రదేశాలు అధికంగా ఉన్న, ఇనుప రజను వెదజల్లినట్లు కనిపించిన ప్రాంతం ఏది?
1) ఆసానపల్లి
2) బుడిగపల్లి
3) రేగొండ గ్రామం
4) వీరకట్టు గ్రామం
- View Answer
- సమాధానం: 3
21. కింది వాటిలో ‘శిలాచిత్ర లేఖనాలు’ బయల్పడిన ప్రాంతాలేవి?
1) రేగొండ, బుడిగపల్లి
2) వీరకట్టు, రేగొండ
3) బుడిగపల్లి, పుల్లూరు
4) వీరకట్టు, బుడిగపల్లి
- View Answer
- సమాధానం: 1
22. దుప్పులు, మనుషులను చిత్రించిన బొమ్మలు ఏ ప్రాంతంలో బయల్పడ్డాయి?
1) ఆసానపల్లి
2) బుడిగపల్లి
3) రేగొండ
4) వీరకట్టు
- View Answer
- సమాధానం: 4