TSPSC Group 2 exam Rules: గ్రూప్‌ 2 పరీక్షకు నిబంధనలు.. ఈ విషయాలు పాటించకపోతే ఇక అంతే..

TSPSC Group 2 exam

నిర్మల్‌చైన్‌గేట్‌: ఈనెల 15, 16వ తేదీల్లో నిర్వహించే గ్రూప్‌–2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతి లేదని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం సంబంధిత అధికారులతో గ్రూప్‌ 2 పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

డిగ్రీ అర్హతతో Pepsico కంపెనీలో ఉద్యోగాలు జీతం 3.5లక్షల నుండి 5లక్షలు: Click Here

పకడ్బందీ ఏర్పాట్లు
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ గ్రూప్‌ 2 పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. నిర్మల్‌ పట్టణంలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8,080 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు.

డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, 16వ తేదీన ఉదయం10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంట ల వరకు పరీక్షలు జరుగుతాయని వివరించా రు. పరీక్ష కేంద్రంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలని తెలిపారు.

పరీక్ష కేంద్రాల్లో అంతరాయం కలగకుండా చర్యలు:
మొబైల్‌ ఫోన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, స్మార్ట్‌ వాచీలు వంటి వస్తువులతో రాకూడదన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించడంతోపాటు జీరాక్స్‌ సెంటర్లను మూసివేయాలన్నారు. కేంద్రాల్లో విద్యుత్‌ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, టా యిలెట్స్‌, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పొరపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించేలా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.

అనంతరం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిబంధనలపై శిక్షకులు రవికుమార్‌ పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో పరీక్షల కోఆర్డినేటర్‌ పీజీ.రెడ్డి, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, గోవింద్‌, శ్రీనివాస్‌, నరసింహారెడ్డి, అంబాజీ, రమణ, కిరణ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, సుదర్శన్‌, సుభాష్‌ పాల్గొన్నారు.

#Tags