Group-2 Syllabus: గ్రూప్-2 సిల‌బ‌స్ ఇదే.. ప‌రీక్ష విధానం ఇలా.. !

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఈ సారి 582 గ్రూప్-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వనున్నారు.
TSPSC Group 2 Syllabus

ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థులు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే.. గ్రూప్ 2 లక్ష్యం సాధించడం కష్టమేమీ కాదు.

గ్రూప్ -2 పరీక్ష విధానం..
గ్రూప్ -2 రాత ప‌రీక్ష‌లో నాలుగు పేపర్లుంటాయి. అవి..

రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ పద్ధతి) :
పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు, 150 మార్కులు

పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
1. భారతదేశ, తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర
2. భారత రాజ్యాంగం, రాజకీయాలు- అవలోకనం
3. సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు)
సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు
(ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.

పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
1. భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు
2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
3. అభివృద్ధి, మార్పు అంశాలు)
సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు
(ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

పేపర్-4: తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్
1. తెలంగాణ తొలి దశ - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970)
2. ఉద్యమ దశ (1971-1990)
3. తెలంగాణ ఏర్పాటు దశ - ఆవిర్భావం (1991-2014)
సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.

ప్రిపరేషన్ ఇలా అయితే..
పేపర్ -1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్:
ఇందులో కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేలకు సమప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ సంబంధిత జీకే, కరెంట్ అఫైర్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పలు పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్‌కు సంబంధించి 40 నుంచి 45 శాతం ప్రశ్నలు తెలంగాణ ప్రాంత జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు-లక్ష్యాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. సామాజిక వివక్ష, హక్కులు, అంశాలు, సమ్మిళిత విధానాలకు సంబంధించి రాజ్యాంగంలోని సంబంధిత అధికరణలపై అవగాహన పెంచుకోవాలి. రాష్ట్ర, దేశ, ప్రపంచ జాగ్రఫీకి సంబంధించి స్టాండర్ట్ బుక్స్ చదవాలి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి ప్రశ్నలుంటాయి. వీటితో పాటు పదో తరగతి స్థాయిలో బేసిక్ ఇంగ్లిష్ ప్రశ్నలు వస్తాయి. దీనికోసం హైస్కూల్ స్థాయి పుస్తకాలు చదవాలి. మ్యాథ్స్ విభాగానికి సంబంధించి ఆర్.ఎస్.అగర్వాల్ రీజనింగ్, అర్థమెటిక్ బుక్స్ ఉపయుక్తంగా ఉంటాయి.

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ 
ఇందులో మూడు విభాగాలు (చరిత్ర, భారత రాజ్యాంగం, సామాజిక స్వరూపం, పబ్లిక్ పాలసీలు) ఉన్నాయి. సెక్షన్-1కి సంబంధించి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండింటినీ మూడు భాగాలుగా (ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక) విభజించుకొని అధ్యయనం చేయాలి. ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో వలసవాదం దశలు, 1857 తిరుగుబాటు, భారతదేశంలో జాతీయవాదం పెరుగుదల, గాంధీ యుగం, దేశ స్వాతంత్య్రానంతరం ముఖ్య ఘట్టాలను చదవాలి.

టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

సింధు, వేద కాల నాగరికతలు, మతపరమైన ఉద్యమాలు (బౌద్ధం, జైనం తదితరాలు), ఇస్లాం మతం-ప్రభావం, భక్తి ఉద్యమాలు-స్వభావం, లలిత కళలు, మొగల్ సామ్రాజ్యం తదితర అంశాలను బాగా చదవాలి.

తెలంగాణ ప్రాచీన, మధ్యయుగ చరిత్రలో ఆయా రాజ వంశాలు, వాటి హయాంలో జరిగిన సామాజిక ఆర్థిక అభివృద్ధి తదితరాలపై అవగాహన (ఉదా: కాకతీయుల కాలంలో ప్రత్యేకత ఉన్న నీటి పారుదల వ్యవస్థ) పెంచుకోవాలి.

ఆధునిక తెలంగాణ చరిత్రలో నిజాం సంస్కరణలు, శిస్తు విధానాలు, ఆయా రంగాల అభివృద్ధి (ఉదాహరణకు విద్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధి), అసఫ్‌జాహీల కాలంలో ఆర్య సమాజ్, ఆది హిందూ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

సెక్షన్-2కి సంబంధించి రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, భారత సమాఖ్య, విశిష్ట లక్షణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన, శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు, పంచాయతీరాజ్ వ్యవస్థ; 73,74 రాజ్యాంగ సవరణలు వాటి ప్రాముఖ్యత తదితర అంశాలను చదవాలి.

సెక్షన్-3కి సంబంధించి దేశంలో మత వ్యవస్థ ఆయా మతాలు - లక్షణాలు, కుల వ్యవస్థ - లక్షణాలు, నిరుద్యోగం, పేదరికం, బాల కార్మిక, వెట్టి చాకిరీ వ్యవస్థలు, జోగిని, దేవదాసీ వ్యవస్థలు, వాటి నేపథ్యం, సమకాలీన సమస్యల్లో భాగంగా ఫ్లోరోసిస్ సమస్య, వలసలు - కారణాలు, తెలంగాణలో రైతు ఉద్యమాలు, దళిత, వెనుకబడిన వర్గాల ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.

టీఎస్‌పీఎస్సీ సిలబస్

పేపర్ - 3: ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
సెక్షన్-1కి సంబంధించి ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయ భావనలు - కొలిచే ప్రమాణాలు, నిరుద్యోగం, పేదరికం భావనలు - వాటి నిర్వచనాలు, నిరుద్యోగ నిర్మూలనకు చేపడుతున్న పథకాలు, పంచవర్ష ప్రణాళికలు-వాటి లక్ష్యాలు తదితరాలను చదవాలి.

సెక్షన్-2కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం- భౌతిక వనరులు, పట్టణీకరణ భావనలు, గ్రామీణ ప్రాంత పరిస్థితులు, అక్షరాస్యత రేటు (స్త్రీ-పురుష అక్షరాస్యత రేటు, పట్టణ-గ్రామీణ ప్రాంత అక్షరాస్యత రేటు), వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు, పశు పోషణ, మత్స్య సంపదల గురించి తెలుసుకోవాలి. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మైనింగ్, తయారీ, సహజ ఇంధన వనరుల లభ్యత, నీటిపారుదల వ్యవస్థలను అధ్యయనం చేయాలి. సేవా రంగం అంశాలపైనా దృష్టిపెట్టాలి.

సెక్షన్ -3కి సంబంధించి సామాజిక అసమానతలు, కుల, వర్ణ, మత పరమైన వివక్షలు, కారణాల విశ్లేషణతో పాటు ప్రధానంగా ఈ విభాగంలో ఆర్థిక సంస్కరణల గురించి అధ్యయనం చేయాలి.

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

పేపర్-4: ‘తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం’
సెక్షన్-1లో పేర్కొన్న ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70) కోసం ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు కారణాలు, దారితీసిన పరిస్థితులు, ఈ కాలంలో ముఖ్యమైన ఉద్యమాలను అధ్యయనం చేయాలి. హైదరాబాద్‌పై పోలీస్ చర్య, పరిణామాలు, భూదానోద్యమం, పెద్ద మనుషుల ఒప్పందం-అందులో ముఖ్యాంశాలు-తీర్మానాలు, 1969లో జై తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన పరిస్థితుల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.

సెక్షన్-2కు సంబంధించి జై ఆంధ్ర ఉద్యమం, రాష్ట్ర‌ప‌తి పాలన, ఆరు సూత్రాల పథకం, జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఏర్పడిన సంస్థలు/పార్టీలు, ముల్కీ నిబంధనలు వంటి వాటిని అధ్యయనం చేయాలి.

సెక్షన్-3 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014)కు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల ఏర్పాటు-అందుకు దారి తీసిన పరిస్థితులు, ఈ దశలో జరిగిన నిరసన కార్యక్రమాలు (మిలియన్ మార్చ్, సడక్ బంద్, సకల జనుల సమ్మె వంటివి), వాటి పర్యవసానాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ముఖ్యమైన కమిటీల రిపోర్ట్‌లను అధ్యయనం చేయాలి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన, తెలంగాణ సంబంధ అంశాలను తెలుసుకోవాలి.

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

ప్రభుత్వ పథకాలపై పట్టు ఉంటే..
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలపై పట్టు సాధించాలి. తెలంగాణ జిల్లాల సమాచారం, లింగ నిష్పత్తి ఎక్కువ, తక్కువగా ఉన్న జిల్లాలు, భౌగోళికంగా తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాల సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. తాజాగా పోటీ పరీక్షల ట్రెండ్ గమనిస్తే సమకాలీన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్‌ను వర్తమాన అంశాలతో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి.
                        - వి. గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ

Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్‌ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!

పుస్తకాల ఎంపికే కీలకం..
తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు కోచింగ్‌కు వెళ్లకుండా సొంతంగా ప్రిపరేషన్ సాగించడం లాభిస్తుంది. ముఖ్యంగా పుస్తకాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒకే పుస్తకాన్ని ఎంచుకుని దాన్నే పలుమార్లు చదవాలి. అకాడమీ పుస్తకాలు, ప్రభుత్వం విడుదల చేసిన బంగారు తెలంగాణ పుస్తకం, తెలంగాణ ఎకనామిక్ సర్వే లాంటి పుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. దినపత్రికలను చదవడం లాభిస్తుంది.
                         - ఆర్. మహేశ్వర్, గ్రూప్- 2 విజేత

గ‌మ‌నిక : గ్రూప్-2 సిల‌బ‌స్‌, ప‌రిక్ష విధానంలో కొద్దిగా మార్పులు ఉండే అవ‌కాశం ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

గ్రూప్స్‌ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే..ఇవి త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

#Tags