Ramagiri Sheetal: ఎలాంటి కోచింగ్ లేకుండానే ప్రిపేర్ అయిన ‘శీతల్’.. బాలికల విద్యాసంస్థలో కొలువు..
పట్టణానికి చెందిన రామగిరి శీతల్ ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. భర్త ఆర్మీ ఉద్యోగి. ఓ వైపు ఇంటి బాధ్యతలు చక్కబెడుతూనే, ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ప్రిపరేషన్ కొనసాగించారు.
ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్ద స్వయంగా సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో గురుకుల టీజీటీ ఫలితాల్లో 1:3 వరకు వెళ్లినా ఉద్యోగం దక్కలేదు. ఇటీవల డీఎస్సీ ఎస్‌ఏ(బయోసైన్స్) ఫలితాల్లోనూ నిరాశే మిగిలింది.
చదవండి: Municipal Teachers: మునిసిపల్ టీచర్లకు 70 శాతం పదోన్నతులు ఇవ్వాలి
18వ ర్యాంకు వచ్చినా జాబ్ త్రుటిలో చేజారింది. అయితే తాజాగా ప్రకటించిన గ్రూప్– 4 ఫలితాల్లో మాత్రం జిల్లాస్థాయిలో 24వ ర్యాంకుతో ప్రతిభ కనబరిచారు. బాలికల విద్యాసంస్థలో జూనియర్ అసిస్టెంట్ కొలువు సాధించారు.
#Tags