TGPSC Group 3: గ్రూప్‌–3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి.. అభ్యర్థులుకు టీజీపీఎస్సీ ప‌లు సూచనలు..

సాక్షి, సిటీబ్యూరో: టీజీపీఎస్సీ గ్రూప్‌–3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ రెవెన్యూ జి.ముకుంద రెడ్డి అధికారులకు సూచించారు.

న‌వంబ‌ర్‌ 12న గ్రూప్‌–3 పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం 45918 మంది అభ్యర్థులు హాజరు కానున్నడంతో 102 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

పీడబ్ల్యూడీ అభ్యర్థుల కోసం 27 కేంద్రాలను కేటాయించామని, ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అభ్యర్థులు టీజీపీఎస్సీ సూచనలు పాటించి సహకరించాలన్నారు. పరీక్ష జరిగేటప్పుడు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, ఏఎన్‌ఎం, మందులను అందుబాటులో ఉంచాలన్నారు.

#Tags