Group-1 Ranker Prudhvi Tej Success Story : సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి.. గ్రూప్‌–1 కొట్టానిలా.. మా నాన్న కూడా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రూప్‌–1 (2018) తుది ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ జూలై 5వ తేదీన విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
APPSC Group-1 Ranker Prudhvi Tej

దీంతో నాలుగేళ్లుగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఫుల్‌స్టాప్ ప‌డింది. ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్‌ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి కమిషన్ ఎట్ట‌కేల‌కు ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో.. గ్రూప్‌–1 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన అనుసూరి ఫృధ్వీతేజ్ స‌క్సెస్ స్టోరీ మీకోసం.. 

Group 1 Ranker Success Story: రైతు బిడ్డ.. ఆర్టీఓ ఉద్యోగానికి సెల‌క్ట్‌.. ఈమె విజ‌యం సాధించ‌డానికి..

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఉద్యోగాన్ని కాద‌ని..
అతనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చినా.. తండ్రిలాగే ఉన్నత ప్రభుత్వ పదవిని సాధించాలనుకున్నాడు. కృషి, పట్టుదల ఉంటే.. ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనని నిరూపించాడు రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన అనుసూరి ఫృధ్వీతేజ్‌.

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

మెయిన్స్ ఉత్తీర్ణత సాధించినా..
తండ్రిలాగే తాను కూడా డీఎస్పీగా శిక్షణ అనంతరం బాధ్యతలు చేపట్టబోతున్నాడు. తాజాగా విడుదలైన 2018 గ్రూప్‌–1 ఫలితాల్లో ఫృధ్వీతేజ్‌ డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2016లో మొద‌టిసారి గ్రూప్‌–1 పరీక్షకు హాజరయ్యాడు. మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా, ఇంటర్య్వూలో సక్సెస్‌ కాలేదు. అయినా పట్టుదలతో మరోసారి 2018లో రెండో ప్రయత్నం చేసి విజయం సాధించాడు.

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

తండ్రి మాదిరితానే..
అనుసూరి ఫృధ్వీతేజ్‌ తండ్రి వెంకటరమణ ప్రస్తుతం గుంటూరు జిల్లా బాపట్లతో డీఎస్పీగా పనిచేస్తున్నారు. తండ్రి మాదిరిగానే తనయుడు కూడా డీఎస్పీగా ఎంపికకావడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

Virendra, Excise SI: కూలీ ప‌నిచేస్తూ..ఎక్సైజ్‌ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..

#Tags