APPSC Group 1 Ranker Dr Manasa Success : సొంతంగా చదివా.. గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా.. నా సక్సెస్ ప్లాన్ ఇదే..
ఈ నేపథ్యంలో APPSC Group 1 Ranker Dr Manasa Kaduluru గారి కుటుంబ నేపథ్యం, ఎడ్యుకేషన్ వివరాలు, గ్రూప్-1కి ఎలా ప్రిపేరయ్యారు, సక్సెస్ ఫార్ములా.. మొదలైన అంశాలపై ప్రత్యేక స్టోరీ మీకోసం..
Dr Manasa Kaduluru.. ప్రజా సేవ చేయాలనేది ఆమె తపన. నిరంతరం ప్రజలతో మమేకమై.. వారి సమస్యలు పరిష్కరించాలనే తపన ఈమెలో కనిపించేంది. అందుకే వైద్యురాలిగా ఉన్న ఆమె.. పట్టుదలతో చదివి గ్రూప్-1లో డీఎస్పీగా ఎంపికయ్యారు.
కుటుంబ నేపథ్యం :
Dr Manasa Kaduluru తండ్రి శ్రీనివాస్‌కుమార్. ఈయన ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఈయన హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అసోసియేట్ డీన్‌గా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట. మానస తల్లి అరుణకుమారి. ఈమె వ్యవసాయశాఖలో పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
ఎడ్యుకేషన్ :
మానస విద్యాభ్యాసం మొత్తం తిరుపతిలో జరిగింది. అనంతరం బీడీఎస్ నెల్లూరు నారాయణలో చేశారు. 2013-18 నెల్లూరులో ఉంటూ బీడీఎస్ పూర్తి చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్రస్థాయి పదో ర్యాంకు సాధించారు. బీడీఎస్ మొత్తంలో 7 బంగారు పతకాలు సాధించారు.
ఎలాంటి కోచింగ్ లేకుండానే..
మానస ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. యూనిఫాం డ్యూటీ మీద ప్రేమ ఉండటంతో మానస 2021-22 నుంచి మిలిటరీలో వైద్యాధికారిగా విధుల్లో చేరారు. అదే సమయంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. ఉద్యోగం చేస్తూనే మరో వైపు గ్రూప్-1కి సొంతంగా చదివారు. తెలిసిన అధ్యాపకుల వద్ద ముఖ్యమైన విషయాలు తెలుసుకుని ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే సొంతంగా పరీక్ష రాశారు. తొలి ప్రయత్నంలో డీఎస్పీగా ఎంపికయ్యారు.
APPSC Group 1 Ranker Dr Manasa Kaduluru పూర్తి ఇంటర్వ్యూ కింది వీడియో చూడొచ్చు..