TSPSC Group1 Prelims Result 2024 Release Date : రెండు రోజుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఈ సారి కటాఫ్ ఇంతేనా..!
563 గ్రూప్-1 పోస్టులకు జూన్ 9వ తేదీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలతో పాటు.. తుది 'కీ' కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు TSPSC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్-2024 పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు.ఈసారి గ్రూప్-1 పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.02 లక్షల మంది (74%) ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ Group-1&2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఈ సారి కటాఫ్ ఇంతేనా..!
దీనికితోడు ఈసారి ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని కేటగిరీల్లో ప్రశ్నలు సులభతరం నుంచి మధ్యస్తంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ Selection Ratio 1:100 ఇవ్వాలంటు.. అభ్యర్థులు కోరుతున్నారు. TSPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ 1:50 Selection Ratioలో ఇచ్చే అవకాశం ఉది. కమిషన్ తుది ‘కీ’విడుదల చేశాకే స్పష్టత కటాఫ్‌పై వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అర్హతకు కనీసం 50 శాతానికి పైబడి మార్కులు రావాల్సిందేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
TSPSC గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే...
సబ్జెక్టు |
సమయం |
మార్కులు |
తేదీ |
జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్) |
3 గంటలు |
150 |
21.10.2024 |
పేపర్–1, జనరల్ ఎస్సే |
3 గంటలు |
150 |
22.10.2024 |
పేపర్–2, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ |
3 గంటలు |
150 |
23.10.2024 |
పేపర్–3, ఇండియన్ సొసైటీ, |
3 గంటలు |
150 |
24.10.2024 |
కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పేపర్–4, ఎకానమీ, అండ్ డెవలప్‌మెంట్ |
3 గంటలు |
150 |
25.10.2024 |
పేపర్–5, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ |
3 గంటలు |
150 |
26.10.2024 |
పేపర్–6, తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ |
3 గంటలు |
150 |
27.10.2024 |