TSPSC Group-1 Mains Exams 2024 Live Updates : ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్...
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల విషయంలో.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది.
ఈ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లను అన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.
ఈ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రీషెడ్యూల్ చేయాలంటూ... కొందరు అభ్యర్థులు నేడు ఉదయం (అక్టోబర్ 18వ తేదీన) హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెల్సిందే.
#Tags