TSPSC 600 Group-1 Jobs New Notification 2024 Released : నేడే ఏక్షణంలోనైన‌ 600 గ్రూప్‌-1 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌.. ఇంకా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్పాటైన కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. మేనిఫెస్టో లో చెప్పిట్టే.. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన (గురువారం) ఏక్షణంలోనైన‌ గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ది. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ది. గ్రూప్-1 లో మరిన్ని పోస్టుల‌తో... ఎల్లుండి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం. 503 పోస్టులతో 2022 ఏప్రిల్‌లో నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.

దీనికి 3.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2022 అక్టోబర్ లొ పరీక్ష నిర్వహణ చేశారు. 2.80 పరీక్ష కి హాజరు అయ్యారు. అలాగే  ప్రిలిమ్స్ ఫలితాలు కూడా ఇచ్చారు. మెయిన్స్ తేదీలు ఖరారు చేసారు. కానీ పేపర్ లీకేజీ వల్ల పరీక్ష రద్దు చేశారు. తిరిగి 2023 జూన్‌లో మళ్ళీ పరీక్ష నిర్వహణ చేశారు.  కానీ పరీక్ష నిర్వహణ లో లోపాలు ఉన్నాయని పరీక్ష రద్దు చేయాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.  దీని తెలంగాణ  పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ చేసారు. కానీ ఇంతవరకు వాదనలు జరగలేదు. ఇక ఈ కేసు క్లియర్ అయ్యే అవకాశం లేదని మరి కొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

జ‌న‌వ‌రి 31వ తేదీ సాయంత్రం 5 గంట‌ లోపు.. 600 గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు..?

కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఫిబ్రవరి 1 న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఎల్లుండి రీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి. జ‌న‌వ‌రి 31వ తేదీ సాయంత్రం 5 గంట‌ లోపు అన్ని శాఖ‌ల్లోని ఖాళీల వివ‌రాలను తెల‌పాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. కొత్త‌, పాత క‌లిపి దాదాపు 600 గ్రూప్‌-1 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags