APPSC Group 1 Prelims Instructions : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌కు ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 8వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ది. గ్రూప్‌–1 ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష‌లో.. పేపర్‌–1, పేపర్‌2గా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హించున్నారు.
appsc group 1 prelims exam instructions

పేపర్‌–1 ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, పేపర్‌2 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా ఈ కింది జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే.

APPSC Group 1 Prelims Exam Day Tips & Tricks : గ్రూప్‌-1 ప్రిలిమ్స్.. లాస్ట్ మినిట్ టిప్స్ ఇవే..

ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే.. 

☛ ఈసారి ప్రిలిమ్స్‌ పరీక్షలో అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించిన సవివర సమాచారం ప్రశ్నపత్రాలు, ఓఎమ్మార్‌ పత్రాల్లో ముద్రించి ఉంటుంది. వాటిని ముందుగా తెలుసుకునేందుకు వీలుగా వాటి నమూనాలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీనివల్ల అభ్యర్థికి సమయం కలసి రావడంతోపాటు పరీక్షపై ఒక అవగాహన ఏర్పడుతుంది.

☛ ప్రశ్నపత్రం, ఓఎమ్మార్‌ బుక్‌లెట్లపై కోడింగ్‌ సిరీస్‌ నంబర్లు సరిసమానంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. తప్పు కోడింగ్‌ ఉంటే కనుక ఆ జవాబు పత్రాలు చెల్లుబాటు కావు. 
☛ అభ్యర్థి తన రిజిస్టర్‌ నంబర్‌ను ప్రశ్నపత్రం బుక్‌లెట్‌పై నిర్ణీత స్థలంలోనే రాయాలి. 
☛ అభ్యర్థులు హాల్‌టికెట్లతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. 
☛ అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. ఆ తరువాత 15 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ కింద 9.45 వరకు మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు అనుమతిస్తారు. 15 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ కింద 1.45 వరకు అవకాశవిుస్తారు. తరువాత ఎవరినీ అనుమతించరు. 
☛ అభ్యర్థి దరఖాస్తు ఫారంలో బయోడేటా వివరాలను తప్పుగా సమర్పించి ఉంటే ఇన్విజిలేటర్‌ వద్ద అందుబాటులో ఉన్న నామినల్‌ రోల్స్‌లో డేటాను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. 
☛ ఓఎమ్మార్‌ సమాధాన పత్రంలో ఇన్విజిలేటర్‌ సంతకాన్ని తీసుకోవాలి.

   గతంలో లేనివిధంగా ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్లు, సూపరింటెండెంట్లే కాకుండా జిల్లాస్థాయి అధి­కారి ఒకరిని ప్రత్యేక పర్యవేక్షకునిగా నియమిస్తున్నారు.

☛ APPSC & TSPSC : గ్రూప్‌–1 ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ముఖ్య‌మైన టాఫిక్స్ ఇవే..

#Tags