Success Story of Tribal Women : తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో మెరిసిన గిరిజన యువతి.. ఈ ఉద్యోగం పొంది..
సాక్షి ఎడ్యుకేషన్: ఎటువంటి పరీక్షల్లోనైనా నెగ్గడం కష్టమే కాని, ప్రయత్నిస్తే ఏదైనా సులువే. క్లిష్టమైన పరీక్షల్లో ఒకటి పోటీ పరీక్షలు. అందులో గ్రూప్స్. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు నిర్వహిస్తారు. ఏటా నిర్వహించే ఈ పరీక్షకు కొన్ని లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. కాని, చాలా తక్కువ మంది కల నెరవేరుతుంది. ఒక ప్రయత్నం విఫలమైతే గెలుపుకు చేరువైయ్యేవరకు ప్రయత్నాలను వదలరు అభ్యర్థులు అటువంటి ఒక కథే ఈ యువతిది కూడా. ఎంతో కష్టపడి చదివి, నేడు డాక్టర్ నుంచి డీఎస్పీగా మారింది. ఆమె గెలుపుకు, ఈ ప్రయాణాన్ని ఎంచుకునేందుకు కారణం ఏంటో తెలుసుకుందాం..
TG DSC Topper Success Story : రిక్షా తొక్కి వచ్చిన డబ్బుతో నా కొడుకుని చదివించానిలా... కానీ..
మొదట డాక్టర్‌గా..
జీవన.. ఒక గిరిజన యువతి, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలుకు చెందిన ఈమె కన్న కల డాక్టర్ కావడం. కాని, కొన్ని కారణాల చేత ఈ కల కలగానే ఉండిపోయింది. ఇక్కడ, జీవన నిరాశ చెందినప్పటికీ మరో మార్గాన్ని ఎంచుకుంది. మొదట తన విద్య జీవితం స్థిరంగా పూర్తవ్వాలని కృషి చేసి, పది, ఇంటర్, గ్రాడ్యువేషన్ పూర్తి చేసింది. అక్కడే తనకు ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలన్న ఆశ ఏర్పడింది.
గ్రప్స్‌లో ర్యాంకుతో..
తన ఆశని వదులుకున్న తరువాత తన ఇంటర్, డిగ్రీను పూర్తి చేసుకుంది. కాని, తన లక్ష్యాన్ని ప్రభుత్వ ఉద్యోగం వైపుకు మళ్లుకొని, డిగ్రీ చివరి సంవత్సరంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్-1కు అభ్యసన ప్రారంభించింది.
గతేడాది నిర్వహించిన ఈ గ్రూప్స్ పరీక్షలోని తొలి దశ ప్రిలిమ్స్‌లో నెగ్గి, ఉన్నత మార్కులతో మెయిన్స్‌కు ఎంపికైంది. ఇక గిరిజన అభ్యర్థుల కోసం ఐటీడీఏ ఉచితంగా అందించిన సివిల్స్ అండ్ గ్రూప్స్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ తీసుకుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
దీంతో తన ప్రయాణం మరింత సులువైంది. ఇక్కడ తనకు ఉత్తమ, నాణ్యమైన కోచింగ్ దక్కింది. ఇలా, తను రెండో దశ మెయిన్స్‌లో కూడా ఉత్తీర్ణతతో నెగ్గింది. ఇందులో ఉత్తీర్ణత సాధించి తొలి ప్రయాత్నంలోనే డీఎస్పీగా ఎంపికైంది జీవన. ఈ కోచింగ్ కేంద్రంలో చేరడం, వారి శిక్షణ పొందడం వల్లే నేడు అనుకున్న గమ్యానికి చేరుకున్నాను, అంతే కాకుండా తన తల్లిదండ్రుల తనకు ఎంతో సహకరించారని అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది జీవన.
ఒక 23 ఏళ్ల సాధారణ యువతి ఎటువంటి సదుపాయాలు లేవు, తాను కన్న డాక్టర్ కల కలగానే ఉండిపోయినా, మరో లక్ష్యాన్ని అనుసరించి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా ఈసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది. చివరికి తన కష్టం ఫలించి నేడు ఒక డీఎస్పీగా కేవలం ఒక యువతికే కాకుండా ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ గెలుపుతో తన కుటుంబం ఆనందం అంతా ఇంతా కాదు.