TSPSC Group I Instructions: నగలు ధరిస్తే నో ఎంట్రీ.. గ్రూప్–1 పరీక్షపై అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచనలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హాల్ టికెట్లు జారీ చేయనుంది. అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. జూన్ 9వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనుంది.
పరీక్షా సమయానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థుల్ని హాల్లోకి అనుమతిస్తారు. పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. ముఖ్యంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి ఎలాంటి నగలు (జ్యువెల్లరీ) ధరించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు ఈ తరహా నిబంధన గతంలో ఎప్పుడూ పెట్టకపోవడం గమనార్హం.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
జ్యువెల్లరీ అని సూచనలో పేర్కొన్నప్పటికీ ఎలాంటి నగలు ధరించకూడదనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లు వేసుకుని రాకూడదు.
గ్రూప్–1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షా విధానం, ఓఎంఆర్ షీట్ నమూనా తదితరాలకు సంబంధించిన వివరాలను టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికొలస్ బుధవారం వెల్లడించారు.
బయోమెట్రిక్ తప్పనిసరి
- ప్రింటెడ్ హాల్ టిక్కెట్లో అభ్యర్థి ఫోటోగ్రాఫ్, సంతకం స్పష్టంగా ఉన్నప్పుడే అది చెల్లుబాటు అవుతుంది. కాబట్టి లేజర్ ప్రింటర్‌తో లేదా కలర్ ప్రింటర్‌తో ఏ4 సైజు కాగితంపై ముద్రించిన హాల్ టిక్కెట్‌ని తీసుకోవాలి. పరీక్షా కేంద్రానికి వచ్చే ముందు ప్రింటెడ్ హాల్ టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి. లేనిపక్షంలో అనుమతించరు.
- ఒకవేళ డౌన్‌లోడ్ చేసిన హాల్ టిక్కెట్‌లో అస్పష్టమైన ఫోటో ఉన్నట్లయితే, అభ్యర్థి మూడు (3) పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను విధిగా అండర్ టేకింగ్‌తో పాటు చివరిగా చదువుకున్న విద్యా సంస్థ గెజిటెడ్ అధికారి/ప్రిన్సిపాల్ చేత ధ్రువీకరణతో తీసుకురావాలి (ఫార్మాట్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in) లో అందుబాటులో ఉంది). లేకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- పరీక్ష కేంద్రంలో ప్రవేశించిన అభ్యర్థి నుంచి బయోమెట్రిక్ వేలిముద్రలు సేకరిస్తారు. ఒకవేళ బయోమెట్రిక్ ఇవ్వకుంటే సదరు అభ్యర్థి జవాబు పత్రం మూల్యాంకనం చేయబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఉదయం 9.30 నుంచే దీనిని ప్రారంభిస్తారు. బయోమెట్రిక్ పూర్తయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం అరగంట కోసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తారు. అవసరమైతే ఇన్విజిలేటర్లను అడిగి సమయం తెలుసుకోవచ్చు.
- అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ముద్రించిన ఓఎంఆర్ జవాబుపత్రాన్ని ఇస్తారు. అభ్యర్థులు ఓంఎఆర్, ప్రశ్నపత్రంలో ముద్రించిన నిబంధనలు సూచనలు పాటించాలి. అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ కాపీని వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అందులోని సూచనల ప్రకారం సరైన విధానంలో వివరాలు రాయడంతో పాటు బబ్లింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి.
- అభ్యర్థులు పరీక్ష ముగిసేవరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అప్పగించాలి. హాల్ టికెట్‌పై ముద్రించిన సూచనల కాపీని కూడా కమిషన్ ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సూచనలు జాగ్రత్తగా చదివి పరీక్ష సమయంలో వాటిని పాటించాలి. అభ్యర్థులు పొరపాట్లు చేసినా, ఓఎంఆర్, హాల్ టికెట్లలోని నిబంధనలు పాటించకున్నా.. కమిషన్ ఎలాంటి బాధ్యత వహించదు.