TSPSC Group 1 Mains Schedule: గ్రూప్‌–1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుద‌ల‌.. షెడ్యూల్‌ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది.

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏడు పరీక్షలు వరుసగా హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ పరిధిలో జరగనున్నాయి. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుందని, గరిష్ట మార్కులు 150 అని కమిషన్‌ వెల్లడించింది.

జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష ప్రశ్నపత్రం మినహా మిగతావన్నీ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారంగా భాషను ఎంచుకుని జవాబులు రాయొచ్చు. కన్వెన్షనల్, డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్‌ తెలిపింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఆరు పరీక్షలను ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుందని, ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదని పేర్కొంది. అలా రాసినట్లైతే వాటిని పరిగణనలోకి తీసుకోమని కమిషన్‌ స్పష్టంచేసింది. జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకింగ్‌ పరిధిలోకి తీసుకోరు.. కానీ ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే ఇతర పరీక్షల పేపర్లను వాల్యుయేషన్‌ చేస్తారు.

ఇందులో ఫెయిలైతే తక్కిన పేపర్లను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి నిర్దేశించిన అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరు కావాలి. ఇందులో ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా వెంటనే అనర్హతకు గురవుతారు. మెయిన్‌ పరీక్షలకు సంబంధించిన సిలబస్, విధానం తదితర పూర్తిస్థాయి సమాచారం కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌ తెలిపారు.  

గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదే... 

సబ్జెక్టు

సమయం

మార్కులు

తేదీ

జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌)

3 గంటలు

150

21.10.2024

పేపర్‌–1, జనరల్‌ ఎస్సే

3 గంటలు

150

22.10.2024

పేపర్‌–2, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ

3 గంటలు

150

23.10.2024

పేపర్‌–3, ఇండియన్‌ సొసైటీ,

3 గంటలు

150

24.10.2024

కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌ పేపర్‌–4, ఎకానమీ, అండ్‌ డెవలప్‌మెంట్‌

3 గంటలు

150

25.10.2024

పేపర్‌–5, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

3 గంటలు

150

26.10.2024

పేపర్‌–6, తెలంగాణ మూవ్‌మెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌

3 గంటలు

150

27.10.2024

#Tags