TGPSC Group-1 Prelims 2024: టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు కఠన నిబంధనలు ఇవే.. హాల్‌టికెట్ విషయంలో మాత్రం..!
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు పకడ్బందీ నిబంధనలు చేపట్టింది. గతంలో ఎదురైన సంఘటనలు, న్యాయవివాదాలకు కారణమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పరీక్ష జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్న విషయాన్ని తెలియజేశారు. అయితే, పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులకు వారు పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వివరణ..
- పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు కేటాయించి సమయానికి అరగంట ముందే చేరుకోవాలి.
- పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించాల్సి ఉంటుంది.
- మహిళలు, పురుషులు ఎటువంటి ఆభరణా ధరించరాదు. అందుకు అనుమతి లేదు.
- అభ్యర్థులంతా ఎవరి వస్తువులను వారే కేంద్రానికి తెచ్చుకోవాలి. పరీక్ష రాసే సమయంలో ఇతరులనుంచి వస్తువులను తీసుకునేందుకు అనుమతి లేదు.
- ఎటువంటి సందేహాలున్న ఇన్విజిలేటర్‌తో మాత్రమే మాట్లాడి తెలుసుకోవాలి.
- ఇతరులతో మాట్లాడినా, మరేవిధమైన చర్యలకు పాల్పడ్డా అభ్యర్థులపై కఠిన చర్యలు తప్పవు.
- పరీక్ష సమయంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే వారపై పోలీస్ కేసు నమోదు అవుతుంది. ఈ పక్షంలో వారు పరీక్షలను రాసేందుకు అనర్హులగా నిలుస్తారు.
NEET UG 2024: త్వరలోనే నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
నిర్ణయం ఇన్విజిలేటర్‌దే..
పరీక్ష గదిలో ఎటువంటి విషయాలపై కూడా ఇన్విజిలేటర్‌దే తుది నిర్ణయంగా నిలుస్తుంది. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను, గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి ఆ తరువాత పరీక్ష గదిలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్‌టికెట్‌పై, మరిన్ని అవసర పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేయాలి. ప్రతీ పత్రాలపై ఉన్న అభ్యర్థి వివరాలు, ఫోటోలు సరైనదిగా ఉండాలి. ఈ విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. పరీక్ష సమయంలో ఏదైన పొరపాటు, లేదా తప్పు జరిగినట్లు తెలితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇలా జరిగితే మాత్రం అభ్యర్థులు పరీక్షలకు అసమర్థులుగా నిలుస్తారు. కాబట్టి, అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, తీసుకురావాలి.
US Visa Fees: అమెరికా వీసా ఫీజులు పెంపు.. వీసా దరఖాస్తు ఫీజులు ఇలా
అభ్యర్థులు హాల్‌టికెట్ విషయంలో పాటించాల్సిన నిబంధనలు..
- వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని ఏ4 షీట్‌లోనే ప్రింట్ తీసుకోవాలి.
- ప్రింట్ తీసుకున్న అనంతరం, అందులో కేటాయించన చోట మీ ఫోటోను అంటించాలి.
- ఫోటో సరిగ్గా లేకపోతే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి తేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలతోపాటు కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ధ్రవీకరణ పత్రాన్ని పూర్తిచేసి తమ ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే పరీక్ష రాసేందుకు అనర్హులగా నిలుస్తారు.
- అభ్యర్థులంతా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలోనే వారి వివరాలు అన్ని పూర్తిగా, స్పష్టంగా ఉన్నయో లేవో చూసుకోవాలి.
- ఈ పరీక్షకు పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ను అభ్యర్థులు పరీక్ష ముగిసి, ఫలితాల వెల్లడి వరకు జాగ్రత్తగా చూసుకోవాలి.
TS TET Results 2024 Release Date : టీఎస్ టెట్ -2024 ఫలితాలు విడుదల.. ఎప్పుడంటే..?