TGPSC Group 1 Mains : గ్రూప్ 1 మెయిన్స్‌.. పూర్తిగా సిలబస్‌ పరిధిలోనే ప్రశ్న పత్రాలు

టీజీపీఎస్సీ.. ఇటీవల 563 పోస్ట్‌ల భర్తీకి గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది.

క్వాలిఫయింగ్‌ పేపర్‌ ఇంగ్లిష్‌తోపాటు మొత్తం ఏడు పేపర్లకు అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగాయి. దీంతో అభ్యర్థుల్లో ప్రశ్నల సరళి ఎలా ఉంది.. టీజీపీఎస్సీ అభ్యర్థుల నుంచి ఏం ఆశిస్తోంది.. భవిష్యత్‌లో గ్రూప్స్‌ పరీక్షల ప్రిపరేషన్‌ ఎలా ఉండాలి తదితర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. టీజీపీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌పై విశ్లేషణాత్మక కథనం.. 

టీజీపీఎస్సీ అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షలకు 67.17 శాతం హాజరు నమోదైంది. మొత్తం 31,383 మందికి మెయిన్స్‌కు అర్హత లభించగా.. 21,093 మంది హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో పరీక్ష రాసిన అభ్యర్థులు కటాఫ్‌ గురించి ఆలోచిస్తుంటే.. భవిష్యత్తు ఔత్సాహికులు ప్రశ్నల సరళిపై ఆరా తీస్తున్నారు. ఈ పరీక్షల సరళిని తెలుసుకోవడం ద్వారా తాము గ్రూప్స్‌ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయంపై స్పష్టత వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు.

Young Professional Posts : న్యూఢిల్లీలో యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!

పూర్తిగా సిలబస్‌ పరిధిలోనే

గ్రూప్‌–1 మెయిన్స్‌ ఆరు పేపర్ల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. అన్ని పేపర్లలోనూ ప్రశ్నలు పూర్తిగా సిలబస్‌ పరిధిలోనే అడిగారని చెబుతున్నారు. అయితే కరెంట్‌ అఫైర్స్‌ సమ్మిళిత ప్రశ్నలు లేవని పేర్కొంటున్నారు. దీంతో.. కరెంట్‌ అఫైర్స్‌ను అనుసంధానం చేసుకుంటూ ఆయా సబ్జెక్ట్‌లను చదివిన వారు కొంత నిరాశ చెందారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిలబస్‌ను పూర్తిగా చదివి.., అన్ని కోణాల్లో సబ్జెక్టులను అవగాహన చేసుకున్న వారు సమర్థంగా సమాధానాలు రాసే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడిగారని పేర్కొంటున్నారు. 

రెండు ప్రశ్నలు తప్పనిసరి

గ్రూప్‌–1 మెయిన్స్‌లో జనరల్‌ ఎస్సే మినహా ప్రతి పేపర్‌లో.. ప్రతి సెక్షన్‌లో 1, 2 ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 3,4,5 ప్రశ్నలకు ఇంటర్నల్‌ ఛాయిస్‌ విధానం అమలు చే­శారు. దీంతో..కంపల్సరీ కొశ్చన్స్‌ విషయంలో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారనే వాదన వినిపిస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

జనరల్‌ ఎస్సే.. మోస్తరుగా

గ్రూప్‌–1 మెయిన్స్‌లో కీలకంగా భావించే జనరల్‌ ఎస్సే పేపర్‌ మోస్తరు క్లిష్టతతో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక పరిస్థితులపై అవగాహన పొందిన వారు మాత్రం సమాధానాలు రాసే అవకాశం ఉంది. ఉదాహరణకు.. అసమాన అభివృద్ధి దేశంలో ప్రాంతీయవాదం పెరుగుదలకు దారితీసింది–చర్చించండి; దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగాయి–చర్చించండి; జాతీయ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆవిష్కరణ విధానం వంటి ఎస్సేలను పేర్కొనొచ్చు. అయితే ఎస్సే రాసే విషయంలో అభ్యర్థులు కొంత సమయాభావానికి గురయ్యారని చెబుతున్నారు.

పేపర్‌–2.. సిలబస్‌ పరిధిలోనే

మెయిన్స్‌ పేపర్‌–2 (హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ)లో సిలబస్‌ పరిధిలోనే లోతైన ప్రశ్నలు అడిగినట్లు పేర్కొంటున్నారు. దీంతో.. సిలబస్‌పై పూర్తి స్థాయి పట్టు సాధించిన వారే సమాధానాలు సరిగా రాసి ఉంటారని చెబుతున్నారు. ఉదాహరణకు గాంధా­ర, మధుర కళలకు మధ్య వ్యత్యాసాలు; సంతాల్‌ తిరుగుబాటు; ఇండో–ఇస్లామిక్‌ వాస్తుశైలి, సాయు­ధ రైతాంగ పోరాటం; శాతవాహనులు–ఇక్ష్వాకుల మధ్య కాలంలో ప్రజల సామాజిక, సాంస్కృతిక జీవన పరిణామం వంటి ప్రశ్నలు సిలబస్‌లో లోతైన పరిజ్ఞానం, విశ్లేషణ నైపుణ్యం ఉన్న వారు మాత్రమే సమాధానం ఇవ్వగలిగేవిగా ఉన్నాయని అభ్యర్థులు,సబ్జెక్ట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

పేపర్‌–3 ఇలా

మెయిన్స్‌లో అభ్యర్థులు ఎంతో కీలకంగా భావించే పేపర్‌–3 (సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్‌)లో సైతం సిలబస్‌ పరిధిలోనే ప్రశ్నలు అడిగారు. 
గవర్నెన్స్‌కు సంబంధించి అభ్యర్థుల పాలన దక్షతను పరిశీలించేలా ప్రశ్నలు ఉన్నాయని అంటున్నారు. ఉదాహరణకు.. జాతీయ విద్యా విధానం, న్యాయ వ్యవస్థ క్రియాశీలత, సుపరిపాలన–వికేంద్రీకరణ, లౌకిక వాదం, పారిశ్రామిక జల వివాదాలు వంటి ప్రశ్నలు అడిగినట్లు పేర్కొన్నారు. సామాజిక సమస్యలపై అవగాహన, రాజ్యాంగంపై పట్టుతోపాటు విశ్లేషణ సామర్థ్యం పెంచుకున్న అభ్యర్థులు ఈ పేపర్‌ను సమర్థంగా రాసే అవకాశముందని నిపుణులు పేర్కొన్నారు. 

పేపర్‌–4.. ఎకానమీ అండ్‌ డవలప్‌మెంట్‌

ఇందులో సామాజిక ఆర్థికాభివృద్ధి అంశాలు సమ్మిళితంగా ప్రశ్నలు అడిగారు. ఉదాహరణకు.. భారత దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో పేదరికం తగ్గింపు తీరు ఒకే తీరుగా లేదు–పరిశీలించండి. అదే విధంగా తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమైన ప్రశ్నలు కూడా ఈ పేపర్‌లో అడిగారు. ఉదాహరణకు.. ‘తెలంగాణ వ్యవసాయ వృద్ధి, ఆహార భద్రత విషయంలో నీటిపారుదల కీలకమైన పాత్రను పోషిస్తుంది’ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా చేపడుతున్న కార్యక్రమాల దృష్ట్యా దీనిని సమర్థించండి. పారిశ్రామిక విధానం.. దేశ, రాష్ట్ర పారిశ్రామిక వేగాన్ని, తీరును నిర్ణయిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్‌ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థను (టీఎస్‌–ఐపాస్‌) దృష్టిలో పెట్టుకుని దీనిపై వ్యాఖ్యానించండి.. వంటి ప్రశ్నలు అడిగారు.

Trade Apprentice : ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు.. ఎక్క‌డ‌!

పేపర్‌–5.. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అత్యంత క్లిష్టం

ఈ పేపర్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ సెక్షన్‌ క్లిష్టంగా ఉందని చెబుతున్నారు. ఈ సెక్షన్‌లో 20 శాతానికి మించి సమాధానాలు ఇచ్చి ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విభాగంలో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉండడం, అదే విధంగా ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. ఒక్కో ప్రశ్నకు రెండు నిమిషాలకు మించి అభ్యర్థులకు సమయం లభించని పరిస్థితి తలెత్తిందని పేర్కొంటున్నారు. సమాధానాలు ఇచ్చే క్రమంలో కనీసం మూడు లేదా నాలుగు అంచెల్లో సాధించాల్సిన పరిస్థితి, రెండు మార్కుల ప్రశ్నలనే అడగడంతో అభ్యర్థులు ఇబ్బందికి గురయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి సంబంధించి స్టాక్‌ అంశాలపైనే ప్రశ్నలు (ఉదా: సోలార్‌ ఎనర్జీ, రెన్యువబుల్‌ ఎనర్జీ) అడగడంతో.. ఈ విభాగంలో కరెంట్‌ అఫైర్స్‌ సంబంధ ప్రశ్నలు వస్తాయని భావించిన అభ్యర్థులు కొంత నిరాశకు గురయ్యారనే వాదన వినిపిస్తోంది.

పేపర్‌–6 ఊహించిన రీతిలోనే

టీజీపీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంపై ప్రశ్నలు ఊహించిన విధంగానే ఉన్నాయి. 1969 నుంచి జరిగిన పరిణామాలపై సహజమైన ఆసక్తి, అవగాహన కలిగిన అభ్యర్థులు సునాయాసంగా సమాధానాలు రాసే వీలుంది. అయితే విస్తృతమైన సబ్జెక్టు కావడంతో కొన్ని ప్రశ్నలకు అధికంగా సమాచారం రాస్తూ పోయిన అభ్యర్థులు చివర్లో మిగతా ప్రశ్నలకు సమ­యం సరిపోక ఇబ్బందిపడినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఈ పేపర్‌కు సంబంధించి నిర్దిష్ట పుస్తకాలు లేకపోవడంతో.. గణాంకాలు, సంవత్సరాలు ప్రస్తావించాల్సిన సందర్భంలో అభ్యర్థులు పొరపాట్లు చేసే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. 

GRSE Contract Jobs : జీఆర్‌ఎస్‌ఈలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ‌ పోస్టులు

#Tags