TGPSC Group 1 Exam: ‘గ్రూప్‌–1’ను రీషెడ్యూల్‌ చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 పరీక్షలు వాయిదా వేయాలని తాము కోరడం లేదని, నవంబర్‌లో హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు రీషెడ్యూల్‌ చేయాలని మాత్రమే కోరుతున్నామని గ్రూప్‌–1 అభ్యర్థులు చెప్పారు.

దీనికోసం అక్టోబర్ 16న ఉదయం గాంధీభవన్‌ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఆ అభ్యర్థులను వదిలివేయాలని, గాంధీభవన్‌లో మధ్యాహ్నం సమావేశమవుతానని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పడంతో పోలీసులు వారిని వదిలేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆయన గ్రూప్‌–1 అభ్యర్థులతో సమావేశం కాగా.. అభ్యర్థులు తమ డిమాండ్లను తెలియజేశారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

జీవో 29 వల్ల రిజర్వేషన్‌ కేటగిరీలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. గ్రూప్‌–1 పరీక్షల మెరిట్‌ను జీవో 55 ద్వారా ఎంపిక చేయాలని కోరారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో కూడా చాలా తప్పులు జరిగాయని మహేశ్‌ గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. జీవో 29పై అభ్యర్థుల అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

అధికారులతో మాట్లాడి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#Tags