Group-1:గ్రూప్–1 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువును పొడిగింపు
గ్రూప్–1 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువును పొడిగింపు
న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్–1 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువును వచ్చే నెల 9వ తేదీ వరకు పొడగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి, హనుమకొండ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 రోజులు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ అందిస్తామని తెలిపారు. అర్హులై ఆసక్తి గల మైనారిటీ అభ్యర్థులు తమ దరఖాస్తులు హనుమకొండ సుబేదారి కలెక్టరేట్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో గల కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 7330990322 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Also Read : General Knowledge
#Tags