Group-1 Exam జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో గ్రూప్‌-1 పరీక్ష

రేపు జరగనున్న గ్రూప్‌-1 పరీక్షకు హాజర్యే విద్యార్థుల సంఖ్య, కేటాయించిన కేం‍ద్రాల గురించి వివరించారు జాయింట్‌ కలెక్టర్‌. అదే విధంగా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఉండాలని, ఎటువంటి పొరపాటు జరగకూడదని అధికారులకు ఆదేశించారు..

విశాఖ విద్య: జిల్లాలో ఆదివారం జరిగే గ్రూప్‌ –1 స్క్రీనింగ్‌ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌ ఆదేశించారు. పరీక్ష నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌ వీసీ హాలులో చీఫ్‌ సూపరింటెండెంట్లు, లైజనింగ్‌ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, 19,664 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, సంబంధిత ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు.

10th Final Exams: టెన్త్‌ పరీక్షలకు సిద్ధమైన ఏర్పాట్లు

పేపర్‌–1 పరీక్ష ఉదయం 10గంటల నుంచి 12 వరకు, పేపర్‌–2 మధ్యాహ్నం 2గంటల నుంచి 4 వరకు రెండు దఫాలుగా జరుగుతుందన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు, లైజనింగ్‌ అధికారులు, అభ్యర్థుల సౌకర్యం దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. 0891 – 2590100, 0891 – 2590102 నంబర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

APPSC Group-1 Prelims: రేపు ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌.. గంట ముందే చేరుకోవాలి!

పరీక్ష జరిగే రోజు ఉదయం 7 గంటలకు కలెక్టరేట్‌ స్ట్రాంగ్‌ రూంకు వచ్చి రెండు పూటలకు సంబంధించిన పరీక్షా పత్రాలను తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్‌ కుమార్‌ పేర్కొన్నారు.

#Tags