Free Coaching: నల్గొండ జిల్లాలో ఈ పరీక్షకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: గ్రూప్ –1 పరీక్షకు ఉచిత శిక్షణ పొందడానికి తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి టి.విజేందర్‌రెడ్డి మార్చి 5న ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షలో ఎంపికై న వారికి 45 రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన (ముస్లిం, క్రైస్తవ,సిక్కు, బౌద్ధ, జైన, పార్సికులు) వారు తమ దరఖాస్తులను నల్లగొండలోని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయం మార్చి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా అందజేయాలని సూచించారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఇతర వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంతో నేరుగా గానీ, 94943 45471, 79811 96060 ఫోన్ నంబర్లనుగాను సంప్రదించాలని పేర్కొన్నారు.
#Tags